CSIR–NGRI MTS Recruitment 2025 : భారత ప్రభుత్వానికి చెందిన CSIR–National Geophysical Research Institute (NGRI), Hyderabad లో Multi-Tasking Staff (MTS) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10వ తరగతి పాసై ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 6వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు (Vacancy Details)
నేషనల్ జియోఫిజిక్స్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్, హైదరాబాద్ నుంచి మల్టీ టాస్కింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడులైంది. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- పోస్టు పేరు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్
- మొత్తం పోస్టులు – 12
Also Read : JMI Non-Teaching Recruitment 2025 | యూనివర్సిటీలో నాన్ టీచింగ్ జాబ్స్
అర్హతలు (Eligibility)
CSIR–NGRI MTS Recruitment 2025 అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- Essential Qualification: 10th Class / Matriculation Pass
- Desirable:
- 12th Class Pass
- సంబంధిత పనిలో అనుభవం ఉంటే ప్రాధాన్యం
- జాబ్ నేచర్: ఫైల్ పనులు, క్లీనింగ్, డాక్యుమెంట్ డెలివరీ, గార్డెన్ మెయింటెనెన్స్, గెస్ట్ హౌస్ అసిస్టెంట్ పనులు, వాహనాల మెయింటెనెన్స్, ఇతర అప్పగించబడిన పనులు.
వయోపరిమితి (Age Limit)
CSIR–NGRI MTS Recruitment 2025 అభ్యర్థులకు 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు (Application Fee)
CSIR–NGRI MTS Recruitment 2025 అభ్యర్థులు SBI Collect ద్వారా మాత్రమే ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ: ₹500/-
- SC / ST / PwBD / Women / Ex-servicemen : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ (Selection Process)
CSIR–NGRI MTS Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక ట్రేడ్ టెస్ట్ మరియు రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది.
- Trade Test:
- ఉద్యోగ నేచర్‌కు సంబంధించిన ప్రాక్టికల్ టెస్ట్
- అర్హులైనవారిని మాత్రమే రాత పరీక్షకు అనుమతిస్తారు
- Competitive Written Exam (OMR):
- ప్రశ్నలు: 150
- సమయం: 2 గంటలు
- నెగటివ్ మార్కింగ్: ప్రతి తప్పు జవాబుకు -1
- సబ్జెక్టులు:
- General Intelligence – 25 Q
- Quantitative Aptitude – 25 Q
- General Awareness – 50 Q
- English Language – 50 Q
- Final Merit: రాత పరీక్ష మార్కుల ఆధారంగా.
జీతం వివరాలు (Salary Details)
CSIR–NGRI MTS Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు 7th CPC ప్రకారం లెవల్-1 పే మ్యాట్రిక్స్‌తో ఆకర్షణీయమైన వేతనం.
- Pay Level: Level–01
- Total Emoluments: ₹35,973/- (approx.)
- DA, HRA, TA వంటి ప్రభుత్వ అలవెన్సులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం (How to Apply)
CSIR–NGRI MTS Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్‌సైట్ https://www.ngri.res.in ని సందర్శించాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అప్లికేషన్‌లో ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్లు తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు (Important Dates)
- అప్లికేషన్ ప్రారంభం: 06 డిసెంబర్ 2025
- చివరి తేదీ: 05 జనవరి 2026
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : DRDO CEPTAM 11 Recruitment 2025 | DRDO భారీ రిక్రూట్మెంట్ – 764 పోస్టులు
FAQ
1) ఎవరు అప్లై చేయవచ్చు?
10th Class పాస్ అయిన భారత పౌరులు అందరూ అప్లై చేయవచ్చు.
2) తెలంగాణలో నివసించేవారికేనా?
కాదు, ఇది All India Recruitment – దేశం మొత్తం నుంచి అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
3) జీతం ఎంత?
సుమారు ₹35,973/- (అలవెన్సులతో కలిపి).
4) ఎంపిక ఎలా ఉంటుంది?
Trade Test తర్వాత OMR ఆధారిత రాత పరీక్ష ద్వారా తుది ఎంపిక.
1 thought on “CSIR–NGRI MTS Recruitment 2025: హైదరాబాద్‌లో 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు”