CSIR IICT Recruitment 2025: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ ఇన్ స్టిట్యూట్(CSIR) – ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(IICT) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు పెట్టుకోగలరు.

CSIR IICT Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ |
పోస్టు పేరు | సైంటిస్ట్ |
పోస్టుల సంఖ్య | 7 |
దరఖాస్తు ప్రక్రియ | 1 అక్టోబర్ – 30 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
Also Read : SAIL SSP Recruitment 2025 | స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు.. ఇప్పుడే అప్లయ్ చేయండి
ఖాళీల వివరాలు (Vacancy Details)
Indian Institute of Chemical Technology (IICT), Hyderabad అనేది Council of Scientific & Industrial Research (CSIR) కింద పనిచేస్తున్న ఒక ప్రీమియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది కెమికల్ సైన్సెస్ & టెక్నాలజీ రంగంలో ప్రాధాన్యం కలిగి, నూతన ఆవిష్కరణలు, ఇండస్ట్రీ-ఆధారిత పరిశోధనలకు పేరుగాంచింది. ఈ సంస్థ నుంచి సైంటిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- పోస్టు పేరు : సైంటిస్ట్
- పోస్టుల సంఖ్య : 7
అర్హతలు(Educational Qualifications & Experience) :
CSIR IICT Recruitment 2025 అభ్యర్థులు Ph.D. (Relevant Discipline / Chemical Sciences / Engineering / Technology) లేదా M.Sc / M.Tech / ME / BE / BTech (సంబంధిత విభాగంలో) ఉత్తీర్ణులై ఉండాలి.
- Ph.D. (Relevant Discipline / Chemical Sciences / Engineering / Technology)
- లేదా M.Sc / M.Tech / ME / BE / BTech (సంబంధిత విభాగంలో) + సంబంధిత రిసెర్చ్ ఎక్స్‌పీరియెన్స్ ఉండాలి.
- పరిశోధనలో మంచి పబ్లికేషన్లు, ప్రాజెక్ట్ వర్క్, పేటెంట్లు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
వయోపరిమితి (Age Limit):
CSIR IICT Recruitment 2025 అభ్యర్థులకు 30.10.2025 నాటికి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు (Application Fee):
CSIR IICT Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- General / OBC / EWS అభ్యర్థులు: ₹100/-
- SC/ST/PwBD/మహిళా అభ్యర్థులు/CSIR ఉద్యోగులు: ఫీజు లేదు
ఎంపిక విధానం (Selection Process):
CSIR IICT Recruitment 2025 అభ్యర్థులను కింది దశల్లో ఎంపిక చేస్తారు.
- అప్లికేషన్ స్క్రీనింగ్ : అభ్యర్థుల అర్హతల ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు.
- ఇంటర్వ్యూ : షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది.
- ఫైనల్ లిస్ట్ : ఇంటర్వ్యూలో పనితీరు ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
Also Read : NHIDCL Deputy Manager (Technical) Recruitment 2025 | రోడ్డు రవాణా శాఖలో డిప్యూటీ మేనేజర్ జాబ్స్
జీతం వివరాలు(Salary Details) :
CSIR IICT Recruitment 2025 సైంటిస్ట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7వ కేంద్ర వేతన సంఘం పే మ్యాట్రిక్స్ 11 ప్రకారం జీతం ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులకు నెలకు సుమారు రూ.1,34,907/- జీతం అందుతుంది.
దరఖాస్తు విధానం (How to Apply):
CSIR IICT Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్‌సైట్ www.iict.res.in లోకి వెళ్లాలి.
- రిక్రూట్మెంట్ విభాగంలో అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 1 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 30 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : VISMUSEUM Recruitment 2025 | మ్యూజియంలో అసిస్టెంట్ పోస్టులు
2 thoughts on “CSIR IICT Recruitment 2025 | కెమికల్ ఇన్ స్టిట్యూట్ లో ఉద్యోగాలు.. ఇలా అప్లయ్ చేయండి”