CSIR CIMAP JSA Recruitment 2025 | మెడిసినల్ & ఆరోమాటిక్ ప్లాంట్స్ లో JSA జాబ్స్

CSIR CIMAP JSA Recruitment 2025 : CSIR సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 08 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మే 9వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు మే 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

CSIR CIMAP JSA Recruitment 2025

పోస్టుల వివరాలు :  

లక్నోలోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ నుంచి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 08 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • పోస్టు పేరు : జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
  • మొత్తం పోస్టుల సంఖ్య :  08
పోస్టు పేరుఖాళీల సంఖ్య
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్)04
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)01
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(స్టోర్ అండ్ పర్చేజ్)03

అర్హతలు: 

CSIR CIMAP JSA Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాల టైపింగ్ స్పీడ్ కలిగి ఉండాలి. 

వయస్సు : 

CSIR CIMAP JSA Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు: 

CSIR CIMAP JSA Recruitment 2025 పోస్టులకు అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. 

  • UR / EWS / OBC : రూ.500/-
  • SC/ ST / PwD / ExSm /Women : ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: 

CSIR CIMAP JSA Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కింది దశల్లో ఎంపిక చేస్తారు. 

  • రాత పరీక్ష
  • టైపింగ్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

రాత పరీక్ష విధానం:  

పరీక్ష విధానంఓఎమ్ఆర్ ఆధారిత లేదా కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామ్
మీడియంహిందీ మరియు ఇంగ్లీష్
పరీక్ష స్టాండర్డ్ 10+2 లెవల్
మొత్తం ప్రశ్నలు200
సమయం2 గంటల 30 నిమిషాలు

రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 క్వాలిఫైయింగ్ కోసం నిర్వహిస్తారు. పేపర్-2 మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు. 

  • పేపర్ -1 : మెంటల్ ఎబిలిటీపై 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. 90 నిమిషాల సమయం ఇస్తారు. పేపర్-1 లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. 
  • పేపర్-2 : జనరల్ అవేర్నెస్ – 50 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ – 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు ఉంటాయి. అంటే 300 మార్కులకు పరీక్ష ఉంటుంది.  60 నిమిషాల సమయం కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు నెగిటివ్ ఉంటుంది.

జీతం వివరాలు : 

CSIR CIMAP JSA Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.19,900 – రూ.63,200/- వరకు జీతం ఇస్తారు. 

దరఖాస్తు విధానం: 

CSIR CIMAP JSA Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన అప్లికేషన్ ప్రింట్ తీసి హార్డ్ కాపీని పంపాల్సి ఉంటుంది. 

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • ‘రిజిస్టర్ అండ్ అప్లయ్’ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. 
  • ఆన్ లైన్ ఫీజు చెల్లించాలి. 
  • అప్లికేషన్ జాగ్రత్తగా ఫిల్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి. తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 
  • హార్డ్ కాపీ : సబ్మిట్ చేసిన అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. దీంతో పాటు అవసరమైన పత్రాలు జత చేసి కింది చిరునామాకు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి. 
  • చిరునామా : కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, CSIR CIMAP, పోస్ట్ ఆఫీస్ – CIMAP, లక్నో – 226015

ముఖ్యమైన తేదీలు: 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 09 – 05 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 31 – 05 – 2025
NotificationCLICK HERE
Apply Online CLICK HERE

Leave a Comment

Follow Google News
error: Content is protected !!