CSIR CFTRI Recruitment 2025 సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల నియామకాలను చేపడుతున్నారు. మొత్తం 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ సైన్స్, మైక్రోబయాలజీ మరియు కెమిస్ట్రీతో సహా వివిధ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు మే 10వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. మరియు మే 19వ తేదీలోపు హార్డ్ కాపీని సమర్పించుకోవాలి.
CSIR CFTRI Recruitment 2025
పోస్టుల వివరాలు :
సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ సైన్స్, మైక్రోబయాలజీ మరియు కెమిస్ట్రీతో సహా వివిధ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య : 18
| పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
| టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్) | 09 |
| టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్ సైన్స్) | 01 |
| టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) | 01 |
| టెక్నికల్ అసిస్టెంట్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) | 04 |
| టెక్నికల్ అసిస్టెంట్ (మైక్రోబయాలజీ) | 01 |
| టెక్నికల్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) | 02 |
అర్హతలు :
CSIR CFTRI Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మరియు అనుభవం మారుతుంది.
| పోస్టు విభాగం | అర్హతలు మరియు అనుభవం |
| మెకానికల్ ఇంజనీరింగ్ | మెకానికల్ ఇంజనీరింగ్ లో 3 సంవత్సరాల డిప్లొమా + 2 సంవత్సరాల అనుభవం (లేదా) 2 సంవత్సరాల లిటెరల్ అడ్మిషన్ డిప్లొమా + 2 సంవత్సరాల అనుభవం |
| కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ | కంప్యూటర్ సైన్స్ లో 3 సంవత్సరాల డిప్లొమా + 2 సంవత్సరాల అనుభవం (లేదా) BSc(కంప్యూటర్స్) + 1 సంవత్సరం అనుభవం |
| ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ | ఎలక్ట్రానిక్స్ లో 3 సంవత్సరాల డిప్లొమా + 2 సంవత్సరాల అనుభవం (లేదా) 2 సంవత్సరాల లిటెరల్ అడ్మిషన్ డిప్లొమా + 2 సంవత్సరాల అనుభవం |
| ఫుడ్ టెక్నాలజీ | BSc(ఫుడ్ సైన్స్ / ఫుడ్ టెక్నాలజీ) + 1 సంవత్సరం అనుభవం |
| మైక్రోబయాలజీ | BSc (మైక్రోబయాలజీ) + 1 సంవత్సరం అనుభవం |
| కెమిస్ట్రీ | Bsc (కెమిస్ట్రీ) +1 సంవత్సరం అనుభవం |
వయస్సు:
CSIR CFTRI Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
CSIR CFTRI Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.500/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ:
CSIR CFTRI Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్ మరియు రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- ట్రేడ్ టెస్ట్ : మొదట అభ్యర్థులకు పోస్టు ఆధారంగా ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు.
- రాత పరీక్ష : ట్రేడ్ టెస్ట్ లో పాసైన వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో 3 పేపర్లు ఉంటాయి.
- పేపర్ – 1: మెంటల్ ఎబిలిటీ
- పేపర్ – 2: జనరల్ అవేర్నెస్
- పేపర్ – 3: సంబంధిత సబ్జెక్టు నాలెడ్జ్
జీతం :
CSIR CFTRI Recruitment 2025 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.64,740/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
CSIR CFTRI Recruitment 2025 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- ముందుగా అధికారిక వెబ్ సైట్ లో పేరు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల.
- తర్వాత లాగిన్ అయ్యి దరఖాస్తు ఫారమ్ ని జాగ్రత్తగా నింపాలి.
- అనంతరం ఆన్ లైన్ లో ఫీజు చెల్లించాలి.
- తర్వాత అసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- ఆన్ లైన్ లో దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- డౌన్ లోడ్ చేసుకున్న హార్డ్ కాపీని మే 19వ తేదీ లోపు నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కి పంపాలి.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 10 – 05 – 2025
- హార్డ్ కాపీ పంపడానికి చివరి తేదీ : 19 – 05 – 2025
| Notification | CLICK HERE |
| Apply Online | CLICK HERE |