CSC Aadhaar Supervisor Notification 2025 – CSC ఈ – గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. CSC ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 203 ఖాళీలు ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 1వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
CSC Aadhaar Supervisor Notification 2025 Overview:
నియామక సంస్థ | CSC ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ |
పోస్టు పేరు | ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ |
పోస్టుల సంఖ్య | 203 |
దరఖాస్తులకు చివరి తేదీ | 01 ఆగస్టు, 2025 |
పోస్టుల వివరాలు :
కామన్ సర్వీస్ సెంటర్ ఈ-గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 203 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు :
CSC Aadhaar Supervisor Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కింది అర్హతలు ఉండాలి.
- 12వ తరగతి (లేదా) 10వ తరగతి + 2 సంవత్సరాల ఐటీఐ (లేదా) 10వ తరగతి + 3 సంవత్సరాల డిప్లొమా
- UIDAI ఆథారైజ్డ ఏజెన్సీ నుంచి ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ సర్టిఫికెట్
- కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి
వయస్సు :
CSC Aadhaar Supervisor Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 45 సంవత్సరాల మధయ వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
CSC Aadhaar Supervisor Notification 2025 ఆధార్ సూపర్ వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
CSC Aadhaar Supervisor Notification 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
దరఖాస్తు విధానం :
CSC Aadhaar Supervisor Notification 2025 అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక పోర్టల్ ని సందర్శించాలి.
- ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టును సెలెక్ట్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : 01 ఆగస్టు, 2025
Apply Link : Click here
Hi sir