CISF Head Constable Recruitment 2025 సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. స్పోర్ట్స్ కోటాలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 403 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు CISF Head Constable ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఉద్యోగాలకు క్రీడల్లో రాణించిన పురుష మరియు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
CISF Head Constable Recruitment 2025
పోస్టుల వివరాలు :
న్యూఢిల్లీలోని CISF ప్రధాన కార్యాలయం నుంచి హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీ కోసం షార్ట్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ కోటా కింద 403 పోస్టులను భర్తీ చేస్తున్నారు. క్రీడల వారీగా పురుషులు మరియు మహిళలకు ఖాళీల వివరాలను కింద చూడవచ్చు.
క్రీడా పేరు | పురుషులు | మహిళలు |
వుషు | 06 | 05 |
తైక్వాండో | 02 | 06 |
కరాటే | 08 | 06 |
పెన్ కాక్ సిలాట్ | 10 | 08 |
ఆర్చరీ | 08 | 08 |
కయకింగ్ | 06 | 06 |
కానోయింగ్ | 06 | 06 |
రోయింగ్ | 06 | 06 |
ఫుట్ బాల్ | 09 | 20 |
హ్యాండ్ బాల్ | 05 | 10 |
జిమ్నాస్టిక్ | 06 | 08 |
ఫెన్సింగ్ | 04 | 04 |
ఖో-ఖో | 12 | 12 |
స్విమ్మింగ్ | 07 | 19 |
అర్హతలు :
CISF Head Constable Recruitment 2025 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి(ఇంటర్మీడియట్) ఉత్తీర్ణులై ఉండాలి. మరియు సంబంధిత క్రీడాల్లో రాణించి ఉండాలి.
- ఇంటర్మీడియట్
- సంబంధిత క్రీడల్లో రాణించి ఉండాలి
వయస్సు:
CISF Head Constable Recruitment 2025 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరి వారికి వయోసడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
CISF Head Constable Recruitment 2025 క్రీడా కోటాలో హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వివిధ దశల్లో ఎంపిక జరుగుతుంది.
- ట్రైల్ టెస్ట్
- ప్రొఫిషియెన్సీ టెస్ట్
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
జీతం వివరాలు :
CISF Head Constable Recruitment 2025 స్పోర్ట్స్ కోటాలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్ 4 ప్రకారం జీతం ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులకు రూ.25,500 నుంచి రూ.81,100/- వరకు జీతం ఇస్తారు.
- CISF Head Constable Salary – రూ.25,500 – రూ.81,100/-
దరఖాస్తు విధానం:
CISF Head Constable Recruitment 2025 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ మే 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అప్లికేషన్ ప్రారంభమైన తర్వాత అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ జాగ్రత్తగా నింపి సబ్మిట్ చేయాలి. అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ | 18 – 05 – 2025 |
దరఖాస్తులకు చివరి తేదీ | 06 – 06 – 2025 |
- Notification : CLICK HERE
I sir I need to job
I sir l need to job