537 పాటల్లో 24,000 డ్యాన్స్ మూవ్స్ తో.. చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డు..!

చిరంజీవి.. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది డ్యాన్స్.. సినిమాల్లో తన స్టెప్పులతో ప్రేక్షకులను అలరించిన హీరో చిరు.. ఈ ఏడాది దేశంలో రెండో అత్యున్నత పురస్కారం అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. చిరంజీవి గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కారు.  దేశ సినీ రంగంలోనే అత్యంత ప్రముఖమైన నటుడిగా, డ్యాన్సర్‌గా గిన్నిస్ అవార్డు అందుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఆయనకు ఈ మొమెంటో అందించారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న చిరూకు మరో గౌరవం కైవసం అయింది.

తన మొదటి చిత్రం ప్రాణం ఖరీదు రిలీజై సరిగ్గా 46 పూర్తయిన సెప్టెంబర్ 22న చిరంజీవి గిన్నిస్ అవార్డు అందుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా అగ్ర హీరోగా కొనసాగుతూ భారత సినీ ఇండస్ట్రీలో ఒకానొక దిగ్గజంగా, అత్యంత స్టార్‍డమ్ దక్కించుకున్న చిరంజీవి.. ఇప్పుడు గిన్నిస్‍ బుక్‍లోకి ఎక్కారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Chiranjeevi is Guinness World Records..

భారత సినీ చరిత్రలో అత్యంత ప్రముఖమైన (ప్రొలిఫిక్) నటుడిగా, డ్యాన్సర్‌గా చిరంజీవిని గుర్తిస్తున్నట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి చెప్పారు.

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్.. మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రజెంటేషన్ అందించారు. ఇండియాలో మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్స్ యాక్టర్, డ్యాన్సర్‌గా గిన్నిస్ రికార్డుల్లో చిరు చోటు దక్కించుకున్నారు. 

537 పాటల్లో 24,000 డ్యాన్స్ మూవ్స్

156 సినిమాల్లో 537 పాటల్లో చిరంజీవి 24,000 డ్యాన్స్ మూవ్స్ చేసినట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. భారత సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రొలిఫిక్ నటుడిగా, డ్యాన్సర్‌గా అధికారికంగా ప్రకటించింది. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీకే ఇది గర్వకారణంగా నిలిచింది. 

Leave a Comment

Follow Google News
error: Content is protected !!