Central bank of India Recruitment 2026 | ఫారిన్ ఎక్స్ఛేంజ్ & మార్కెటింగ్ ఆఫీసర్ జాబ్స్ – 350 పోస్టులు

Central bank of India Recruitment 2026 : పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లో మంచి జీతం, స్థిరమైన ఉద్యోగం, దేశవ్యాప్తంగా పని చేసే అవకాశం కోరుకునే వారికి ఇది మంచి అవకాశం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 సంవత్సరానికి Foreign Exchange Officer (Scale III) మరియు Marketing Officer (Scale I) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు (Vacancy Details)

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో Foreign Exchange Officer పోస్టులు 50, Marketing Officer పోస్టులు 300 ఉన్నాయి. SC, ST, OBC, EWS, UR కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్తిస్తుంది. బ్యాంక్ అవసరాన్ని బట్టి ఖాళీల సంఖ్యలో మార్పులు ఉండవచ్చు.

Also Read : Telangana District Court Notification 2026 | తెలంగాణ జిల్లా కోర్టుల్లో భారీ నోటిఫికేషన్ – 859 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం

అర్హతలు (Educational Qualifications)

Central bank of India Recruitment 2026 Foreign Exchange Officer పోస్టుకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, ఫారెక్స్ లేదా ట్రేడ్ ఫైనాన్స్‌లో అనుభవం ఉండాలి. Marketing Officer పోస్టుకు డిగ్రీతో పాటు Marketing స్పెషలైజేషన్‌తో MBA లేదా PGDM పూర్తి చేసి ఉండాలి. అన్ని విద్యార్హతలు ప్రభుత్వం గుర్తించిన యూనివర్సిటీ నుంచి ఉండాలి.

వయోపరిమితి (Age Limit)

Central bank of India Recruitment 2026 Foreign Exchange Officer పోస్టుకు 25 నుంచి 35 సంవత్సరాలు, Marketing Officer పోస్టుకు 22 నుంచి 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBCలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు గరిష్టంగా 10 సంవత్సరాల వరకు వయో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు (Application Fee)

Central bank of India Recruitment 2026 SC, ST, దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ₹175 మాత్రమే ఫీజు ఉంటుంది. ఇతర అన్ని కేటగిరీల అభ్యర్థులకు ₹850 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి మరియు ఒకసారి చెల్లించిన తర్వాత తిరిగి ఇవ్వరు.

ఎంపిక ప్రక్రియ (Selection Process)

Central bank of India Recruitment 2026 ఎంపిక ప్రక్రియలో రెండు దశలు ఉంటాయి. మొదట ఆన్‌లైన్ రాత పరీక్ష, తరువాత ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్షకు 70 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కుల వెయిటేజ్ ఉంటుంది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు.

జీతం వివరాలు (Salary Details)

Central bank of India Recruitment 2026 Foreign Exchange Officer (Scale III) పోస్టుకు ప్రారంభ బేసిక్ జీతం సుమారు ₹85,920 ఉంటుంది. Marketing Officer (Scale I) పోస్టుకు బేసిక్ జీతం సుమారు ₹48,480 నుంచి ప్రారంభమవుతుంది. వీటితో పాటు DA, HRA, ఇతర అలవెన్సులు బ్యాంక్ నిబంధనల ప్రకారం అందుతాయి.

దరఖాస్తు విధానం (How to Apply)

Central bank of India Recruitment 2026 అభ్యర్థులు 20 జనవరి 2026 నుంచి 03 ఫిబ్రవరి 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న అప్లికేషన్ లింక్ ద్వారా ఫారం నింపాలి. ఫోటో, సంతకం, అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ఫీజు చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభం : 20 జనవరి, 2026
  • చివరి తేదీ : 03 ఫిబ్రవరి, 2026
NotificationClick here
Apply OnlineClick here

Also Read :  Exim Bank MT Recruitment 2026 | ఇంపోర్ట్-ఎక్స్ పోర్ట్ బ్యాంకులో మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఉద్యోగాలు

1 thought on “Central bank of India Recruitment 2026 | ఫారిన్ ఎక్స్ఛేంజ్ & మార్కెటింగ్ ఆఫీసర్ జాబ్స్ – 350 పోస్టులు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!