CDAC Recruitment 2025: Apply Online for Project Engineer, Executive Director & Latest Vacancies

 CDAC Recruitment 2025 : సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(CDAC) నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ప్రాజెక్ట్ ఇంజనీర్, కన్సల్టెంట్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. సుమారు 646 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. ఈ పోస్టులను బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్ కతా, ముంబై, నోయిడా, పూణే, తిరువనంతపురం మరియు గౌహతిలోని కేంద్రాల్లో భర్తీ చేస్తున్నారు. 

CDAC Recruitment 2025 Overview

నియామక సంస్థసెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(CDAC)
పోస్టు పేరువివిధ ప్రాజెక్ట్ ఇంజనీర్, కన్సల్టెంట్ మరియు ఇతర పోస్టులు
ఖాళీల సంఖ్యమల్టిపుల్
దరఖాస్తు ప్రక్రియ01 అక్టోబర్ – 20 అక్టోబర్, 2025
దరఖాస్తు విధానంఆన్ లైన్

ఖాళీల వివరాలు(Vacancy Details) : 

Centre for Development of Advanced Computing (CDAC) భారత ప్రభుత్వ Ministry of Electronics and Information Technology (MeitY) కింద పనిచేసే ఒక ప్రీమియర్ R&D సంస్థ. ఈ సంస్థ నుంచి కాంట్రాక్ట ప్రాతిపదికన వివిధ ప్రాజెక్ట్ ఇంజనీర్, కన్సల్టెంట్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. సంస్థ యొక్క అన్ని కేంద్రాల్లో ఖాళీలు ఉన్నాయి. సుమారు 646 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

కేంద్రం పేరుఖాళీల సంఖ్య
బెంగళూరు110
చెన్నై105
హైదరాబాద్65
కోల్ కతా06
ముంబై12
నోయిడా173
పూణే99
తిరువనంతపురం54
సినీ గౌహతి22

Also Read : University of Hyderabad Recruitment 2025 | హైదరాబాద్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ జాబ్స్

అర్హతలు (Education Qualification):

CDAC Recruitment 2025 అన్ని పోస్టులకు కూడా అభ్యర్థులు AICTE/UGC ఆమోదించబడిన కాలేజీ లేదా సంస్థ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అర్హత సాధించి ఉండాలి. నియామకానికి ముందే కోర్సు పూర్తి చసే చివరి సెమిస్టర్ అభ్యర్థులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.

వయోపరిమితి(Ae Limit): 

CDAC Recruitment 2025 నోటిఫికేషన్ ప్రతి పోస్టును బట్టి గరిష్ట వయోపరిమితి ఉంటుంది. అభ్యర్థులు గమనించి దరఖాస్తు చేసుకోగలరు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు(Application Fees):

CDAC Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ(Selection Process): 

CDAC Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక వివిధ దశల్లో జరుగుతుంది. 

  • అప్లికేషన్ స్క్రీనింగ్
  • రాత పరీక్ష / స్కిల్ టెస్ట్(ఏదైనా ఉంటే)
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

Also Read : RRB JE Recruitment 2025 | రైల్వేలో 2,570 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్

జీతం వివరాలు(Salary Details) :   

CDAC Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు కన్సాలిడేటెడ్ జీతం ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థుల అనుభవం ఆధారంగా జీతం ఉంటుంది.  

దరఖాస్తు విధానం(How to Apply):

CDAC Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు CDAC వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • కెరీర్ విభాగంలో ‘కరెంట్ ఓపెనింగ్స్’ వద్ద నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. 
  • కావాల్సిన స్థానాన్ని ఎంచుకొని అప్లయ్ పై క్లిక్ చేయాలి. 
  • మొబైల్ నెంబర్ మరియు ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • ఫొటో మరియు రెజ్యుమ్ అప్ లోడ్ చేయాలి. 
  • తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 01 అక్టోబర్, 2025
  • దరఖస్తులకు చివరి తేదీ : 20 అక్టోబర్, 2025
Official PortalClick Here

Also Read : SAMEER Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో బంపర్ జాబ్స్

Follow Google News
error: Content is protected !!