CDAC Project Staff Recruitment 2025 సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(CDAC) చెన్నై సెంటర్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ మరియు సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 62 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
CDAC Project Staff Recruitment 2025 Overview
నియామక సంస్థ | సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(CDAC) |
పోస్టు పేరు | ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజనీర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ |
పోస్టుల సంఖ్య | 62 |
జాబ్ లొకేషన్ | చెన్నై |
దరఖాస్తులకు చివరి తేదీ | 20 ఆగస్టు, 2025 |
పోస్టుల వివరాలు :
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(CDAC) నుంచి ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 62 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
ప్రాజెక్ట్ అసోసియేట్ (ఫ్రెషర్స్) | 25 |
ప్రాజెక్ట్ ఇంజనీర్ | 17 |
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ | 04 |
ప్రాజెక్ట్ ఆఫీసర్ (మార్కెటింగ్) | 01 |
ప్రాజెక్ట్ టెక్నీషియన్ | 15 |
మొత్తం | 62 |
అర్హతలు :
CDAC Project Staff Recruitment 2025 ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మరియు అనుభవం మారుతుంది.
- ప్రాజెక్ట్ అసోసియేట్(ఫ్రెషర్) : BE / B.Tech
- ప్రాజెక్ట్ ఇంజనీర్ : BE / B.Tech + 1 సంవత్సరం అనుభవం
- సీనియర్ ప్రాజెక్ట ఇంజనీర్ : BE / B.Tech / MCA / MSc + 4 సంవ్సరాల అనుభవం
- ప్రాజెక్ట్ ఆఫీసర్ (మార్కెటింగ్) : BE / B.Tech తో మార్కెటింగ్ లో MBA + 3 సంవత్సరాల అనుభవం
- ప్రాజెక్ట్ టెక్నీషియన్ : ఐటీఐ లేదా ఇంజనీరింగ్ లో డిప్లొమా లేదా బీసీఏ లేదా బీఎస్సీ(కంప్యూటర్స్) + 1-3 సంవత్సరాల అనుభవం
వయస్సు:
CDAC Project Staff Recruitment 2025 పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
పోస్టు పేరు | వయోపరిమితి |
ప్రాజెక్ట్ అసోసియేట్(ఫ్రెషర్) | 30 సంవత్సరాలు |
ప్రాజెక్ట్ ఇంజనీర్ | 45 సంవత్సరాలు |
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ | 40 సంవత్సరాలు |
ప్రాజెక్ట్ ఆఫీసర్(మార్కెటింగ్) | 50 సంవత్సరాలు |
ప్రాజెక్ట్ టెక్నీషియన్ | 30 సంవత్సరాలు |
అప్లికేషన్ ఫీజు :
CDAC Project Staff Recruitment 2025 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
CDAC Project Staff Recruitment 2025 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- టెక్నికల్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ
జీతం వివరాలు :
CDAC Project Staff Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు కన్సాలిడేటెడ్ జీతం ఇవ్వడం జరుగుతుంది.
- ప్రాజెక్ట్ అసోసియేట్ : రూ.34,000/-
- ప్రాజెక్ట్ ఇంజనీర్ : రూ.40,000/-
- సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ : రూ.60,000/-
- ప్రాజెక్ట్ ఆఫీసర్ : రూ.31,000/-
- ప్రాజెక్ట్ టెక్నీషియన్ : రూ.26,910/-
దరఖాస్తు విధానం :
CDAC Project Staff Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు CDAC అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- కెరీర్స్ విభాగంలో కరెంట్ వేకెన్సీస్ పై క్లిక్ చేయాలి.
- CDAC Project Staff Recruitment 2025 పై క్లిక్ చేయాలి.
- గూగుల్ ఫారమ్ పై క్లిక్ చేసి అవసరమైన వివరాలతో పూరించాలి. 20 ఆగస్టు, 2025 లోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- తర్వాత CDAC వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ మరియు ఒక పేజీ రైట్ అప్(ఎక్స్ పీరియన్స్ పోస్టుల కోసం) డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ నింపి, ఫొటో అతికించి, సంతకం చేయాలి.
- నింపిన దరఖాస్తు ఫారమ్ మరియు అవసరమైన సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూ సమయంలో తీసుకెళ్లాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : 20 ఆగస్టు, 2025
Notification | Click here |
Google Form | Click here |
Official Website | Click here |
Where is apply link