CDAC Project Staff Recruitment 2025 సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెకట్ ఇంజనీర్ మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 91 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జూలై 9వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
CDAC Project Staff Recruitment 2025 Overview :
నియామక సంస్థ | సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) |
పోస్టు పేర్లు | ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ |
పోస్టుల సంఖ్య | 91 |
జాబ్ లొకేషన్ | తిరువనంతపురం, ఢిల్లీ, చెన్నై, అస్సాం, భువనేశ్వర్ మరియు చండీగఢ్ |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ (గూగుల్ ఫారమ్ ద్వారా) |
పోస్టుల వివరాలు :
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 91 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు తిరువనంతపురం, ఢిల్లీ, చెన్నై, అస్సాం, భువనేశ్వర్ మరియు చండీగఢ్ వంటి బహుళ ప్రదేశాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
ప్రాజెక్ట్ మేనేజర్ | 03 |
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ | 12 |
ప్రాజెక్ట్ ఇంజనీర్ – ఎక్స్ పీరియన్స్ | 22 |
ప్రాజెక్ట్ ఇంజనీర్ – ఫ్రెషర్ | 54 |
మొత్తం | 91 |
అర్హతలు :
CDAC Project Staff Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత ఫీల్డ్ లో BE / B.Tech ఉత్తీర్ణులై ఉండాలి.
- అర్హత : BE / B.Tech లేదా MCA / MSc / ME / M.tech
- స్పెషలైజేషన్స్ /డొమైన్స్ : కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ అప్లికేషన్ / అప్లైడ్ ఎలక్ట్రానిక్స్
అనుభవం :
- ప్రాజెక్ట్ మేనేజర్ : కనీసం 9 సంవత్సరాల
- సీనియర ప్రాజెక్ట్ ఇంజనీర్ : కనీసం 4 సంవత్సరాలు
- ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎక్స్ పీరియన్స్) : 1 – 2 సంవత్సరాలు
- ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఫ్రెషర్) : అనుభవం అవసరం లేదు.
వయోపరిమితి :
CDAC Project Staff Recruitment 2025 ఉద్యోగాలకు వయోపరిమితి పోస్టును బట్టి మారుతుంది.
- ప్రాజెక్ట్ మేనేజర్ : 56 సంవత్సరాల వరకు
- సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ : 40 సంవత్సరాల వరకు
- ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎక్స్ పీరియన్స్) : 45 సంవత్సరాల వరకు
- ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఫ్రెషర్) : 30 సంవత్సరాలు వరకు
- వయోసడలింపు : ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు :
CDAC Project Staff Recruitment 2025 ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
CDAC Project Staff Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- షార్ట్ లిస్ట్ : అర్హతలు మరియు అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- ఆన్ లైన్ ఇంటర్వ్యూ : అస్సాం, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై మరియు ఢిల్లీలోని పోస్టులకు ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- వాక్ ఇన్ ఇంటర్వ్యూ : తిరువనంతపురంలో ఉన్న పోస్టులకు వాన్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ : ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
జీతం వివరాలు :
CDAC Project Staff Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల అర్హతలు మరియు అనుభవానికి అనుగుణంగా జీతం ఇవ్వడం జరుగుతుంది. జీతం వివరాలు కింది విధంగా ఉంటాయి.
- ప్రాజెక్ట్ మేనేజర్ : నెలకు రూ.1,10,000/-
- సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ : రూ.60,000/-
- ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎక్స్ పీరియన్స్) : రూ.37,500/-
- ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఫ్రెషర్) : రూ.37,500/-
దరఖాస్తు విధానం :
CDAC Project Staff Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు ముందుగా Google Form ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లింక్ కింద ఇవ్వబడింది.
- రిజిస్ట్రేషన్ చేసుకున్నతర్వాత, C-DAC వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ మరియు వన్ పేజీ రైట్ అప్ డాక్యుమెంట్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ పూర్తిగా నింపి, దానికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించాలి.
- వాక్ ఇన్ ఇంటర్వ్యూ : అప్లికేషన్ ఫారమ్, 6 సెట్ల వన్ పేజీ రైట్ అప్ డాక్యుమెంట్స్, ఒరిజనల్ సర్టిఫికెట్లు మరియు స్వీయ ధ్రువీకరించబడిన ఒక సెట్ జిరాక్స్ కాపీలను ఇంటర్వ్యూ వేదికకు తీసుకెళ్లాలి.
- ఆన్ లైన్ ఇంటర్వ్యూ : పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్, సర్టిఫికెట్లు, ఐడీ ప్రూఫ్ మొదలైనవి స్కాన్ చేసి, చివరి తేదీ లోపు tvmrct@cdac.in ఈమెయిల్ కి పంపాలి. సబ్జెక్టులో పోస్ట్ కోడ్ మరియు మీ పేరును స్పష్టంగా రాయాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు ప్రారంభ తేదీ | 25 జూన్, 2025 |
దరఖాస్తులకు చివరి తేదీ | 09 జూలై, 2025 (సాయంత్రం 5:00 గంటలకు) |
ఇంటర్వ్యూ తేదీ (తాత్కాలికం) | జూలై 2025 4వ / 5వ వారం |
Notification | Click here |
Google form Link | Click here |
Official Website | Click here |