C-DOT Recruitment 2025 : సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల నియమకాలు చేపడుతున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 23వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. ఈ అప్రెంటిస్ షిప్ ఒక సంవత్సరం పాటు బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని C-DOT క్యాంపస్ లో నిర్వహించడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్లు మరియు డిప్లొమా అభ్యర్థులు తమ స్కిల్స్ పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం.
C-DOT Recruitment 2025
పోస్టుల వివరాల :
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DOT) నుంచి గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అప్రెంటిస్ ఖాళీలను అయితే నోటిఫికేషన్ లో పేర్కొనలేదు.
అర్హతలు :
C-DOT Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు 2021, 2022, 2023, 2024 సంవత్సరాలలో పాసైన గ్రాడ్యుయేట్స్ మరియు డిప్లొమా అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు. అప్రెంటిస్ పోస్టులకు అర్హతలు కింది పట్టికలో ఇవ్వబడింది. అభ్యర్థులు జాగ్రత్తగా చూసి దరఖాస్తు చేేసుకోగలరు.
పోస్టు పేరు | అర్హతలు |
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ( టెక్నికల్) | BE / B.Tech (ECE, CSE, IT) |
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ | BA / BSc / B.Com / BSW / B.Voc / BCA / BBA / BBM / బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా ఏదైనా 3 సంవత్సరాల డిగ్రీ |
డిప్లొమా అప్రెంటిస్ | డిప్లొమా టెక్నికల్ (ECE/ CSE/ IT)డిప్లొమా నాన్ టెక్నికల్ (కమర్షియల్ ప్రాక్టీస్ / మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్ |
వయస్సు:
C-DOT Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు గరిష్ట వయస్సు పేర్కొనలేదు. 2021, 2022, 2023, 2024 సంవత్సరాల్లో గ్రాడ్యుయేషన్ మరియు డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరకాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
C-DOT Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అందరు కూడా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ:
C-DOT Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకున్న వారిని విద్యార్హతలు మరియు అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు మరియు స్కిల్ టెస్ట్ కి పిలుస్తారు. ఇంటర్వ్యూ మరియు స్కిల్ టెస్ట్ లో పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం :
C-DOT Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అభ్యర్థులకు స్టయిఫండ్ అనేది ఇస్తారు.
పోస్టు పేరు | స్టైఫండ్(నెలకు) |
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ | రూ.20,837/- |
డిప్లొమా అప్రెంటిస్ | రూ.15,628/- |
దరఖాస్తు విధానం:
C-DOT Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థులు కింద దశలను అనుసరించి దరఖాస్తు చేేసుకోవచ్చు.
- https://nats.education.gov.in/ వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అక్కడ రిజిస్టర్ చేసుకుని పోర్టల్ లో లాగిన్ అవ్వాలి.
- C-DOT నోటిఫికేషన్ కి వ్యతిరేకంగా అప్లయ్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులకు చివరి తేదీ | 04 – 04 – 2025 |
ఇంటర్వ్యూ తేదీ | 23 – 04 – 2025 |
జాయినింగ్ తేదీ | 01 – 05 – 2025 లేదా 16 – 05 – 2025 |
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |