BSF HC RO/RM Recruitment 2025 బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) మరియు హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1,121 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆగస్టు 24వ తేదీ నుంచి సెప్టెంబర్ 23వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
BSF HC RO/RM Recruitment 2025 Overview
నియామక సంస్థ | బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) |
పోస్టు పేరు | హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్), హెడ్ కానిస్టేబుల్(రేడియో మెకానిక్) |
పోస్టులు సంఖ్య | 1,121 |
దరఖాస్తు ప్రక్రియ | 24 ఆగస్టు – 23 సెప్టెంబర్, 2025 |
వయోపరిమితి | 18 – 25 సంవత్సరాలు |
ఎంపిక ప్రక్రియ | రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మరియు మెడికల్ టెస్ట్ |
జీతం | రూ.25,500 – రూ.81,100/- |
పోస్టుల వివరాలు :
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రేడియో ఆపరేటర్ మరియు రేడియో మెకానిక్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1121 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
హెడ్ కానిస్టేబుల్(రేడియో ఆపరేటర్) | 910 |
హెడ్ కానిస్టేబుల్(రేడియో మెకానిక్) | 211 |
అర్హతలు :
BSF HC RO/RM Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి.
- హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) : మ్యాథ్స్, ఫిజిక్స్ & కెమిస్ట్రీ సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా) 10వ తరగతి ఉత్తీర్ణత + రేడియో / టెలివిజన్, ఎలక్ట్రానిక్స్, కోపా, జనరల్ ఎలక్ట్రానిక్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రేడ్లలో 2 సంత్సరాల ఐటీఐ
- హెడ్ కానిస్టేబుల్(రేడియో మెకానిక్): మ్యాథ్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా) 10వ తరగతి ఉత్తీర్ణత + రేడియో/టెలివిజన్, జనరల్ ఎలక్ట్రానిక్స్, కోపా, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఐటీ అండ్ ఈఎస్ఎమ్, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, కంప్యూటర్ హార్డ్ వేర్, నెట్ వర్క్ టెక్నీషియన్, మెకాట్రానిక్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లలో 2 సంవత్సరాల ఐటీఐ
వయోపరిమితి :
BSF HC RO/RM Recruitment 2025 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
BSF HC RO/RM Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / OBC / EWS (పురుషులు) : రూ.100/-
- ఎస్సీ / ఎస్టీ / మహిళలు / డిపార్ట్మెంట్, మాజీ సైనికులు : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ:
BSF HC RO/RM Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష – 200 మార్కులకు
- శారీరక ప్రమాణాల పరీక్ష
- శారీరక సామర్థ్య పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
BSF HC RO/RM Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7వ సీపీసీ లెవల్-4 ప్రకారం రూ.25,500 – రూ.81,100/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
BSF HC RO/RM Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక పోర్టల్ ని సందర్శించాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 24 ఆగస్టు, 2025
- దరఖస్తులకు చివరి తేదీ : 23 సెప్టెంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |