BSF Constable GD Sports Recruitment 2025 : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 391 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన క్రీడాకారులు అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

ఖాళీల వివరాలు :
- కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పురుషులు : 197
- కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) మహిళలు : 194
- మొత్తం పోస్టులు : 391
Also Read : “iQOO 15 India Launch in November – Specs That Will Blow Your Mind!”
అర్హతలు :
- అభ్యర్థులు గుర్తింపు పొదిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా దానికి సమానమైన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
- 04.11.2023 మరియు 4.11.2025 మధ్య నోటిఫికేషన్ లో పేర్కొన్న అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న లేదా పతకం గెలుచుకున్న క్రీడాకారులు.
వయోపరిమితి :
అభ్యర్థులకు 01 ఆగస్టు, 2025 నాటికి 28 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
- జనరల్ / ఓబీసీ (పురుష అభ్యర్థులు) : రూ.159/-
- ఎస్సీ / ఎస్టీ / మహిళలు : ఫీజు లేదు.
- ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ:
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- శారీరక ప్రమాణాల పరీక్ష
- వివరణాత్తమక వైద్య పరీక్ష
- మెరిట్ లిస్ట్
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-3 ప్రకారం రూ.21,700/- నుంచి రూ.69,100/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://rectt.bsf.gov.in/ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 16 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 4 నవంబర్, 2025
Notification | Click here |
Official Website | Click here |
Also Read : BEL Ghaziabad Recruitment 2025 | ఇంజనీరింగ్ & టెక్నీషియన్ పోస్టులు