BOB Office Assistant Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ప్యూన్ జాబ్స్

BOB Office Assistant Recruitment 2025 బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి బంపర్ నోటిఫికేషన్ వచ్చింది. ఆఫీస్ అసిస్టెంట్ (ప్యూన్) పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మే 3వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు మే 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. 18  నుంచి 26 సంవత్సరాల వయస్సు ఉన్న అభ్యర్థులు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. . 

BOB Office Assistant Recruitment 2025

పోస్టుల వివరాలు : 

బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దేశ వ్యాప్తంగా మొత్తం 500 ఖాళీలు ఉన్నాయి. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 22 ఖాళీలు, తెలంగాణ రాష్ట్రంలో 13 ఖాళీలు ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
ఆఫీస్ అసిస్టెంట్ (ప్యూన్)500
  • ఆంధ్రప్రదేశ్ – 22 ఖాళీలు
  • తెలంగాణ – 13 ఖాళీలు
కేటగిరీ వారీగా పోస్టులుఖాళీలు
జనరల్252
EWS 42
OBC108
SC65
ST33

వయస్సు: 

BOB Office Assistant Recruitment 2025 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 26 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అర్హతలు : 

BOB Office Assistant Recruitment 2025 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింద అర్హతలు ఉండాలి. 

  • 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 
  • సంబంధిత రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం యొక్క స్థానిక భాషపై మంచి పట్టు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు తెలుగు లాంగ్వేజ్ పై మంచి పట్టు ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: 

BOB Office Assistant Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

కేటగిరిఅప్లికేషన్ ఫీజు
UR / EWS / OBCరూ.600 + ట్యాక్స్ + పేమెంట్ గేట్ వే ఛార్జెస్
SC / ST / PwBD / EXS / Women100  + ట్యాక్స్ + పేమెంట్ గేట్ వే ఛార్జెస్

ఎంపిక ప్రక్రియ : 

BOB Office Assistant Recruitment 2025 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఆన్ లైన్ పరీక్ష మరియు భాషా ప్రావీణ్య పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • ఆన్ లైన్ ఎగ్జామ్
  • భాషా ప్రావీణ్య పరీక్ష

ఆన్ లైన్ ఎగ్జామ్ : ఆన్ లైన్ పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ఎలమెంటరీ అరిథెమెటిక్, రీజనింగ్ పై ప్రశ్నలు అడుగుతారు. 80 నిమిషాల సమయం ఉంటుంది.

జీతం : 

BOB Office Assistant Recruitment 2025 బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆఫీస్ అసిస్టెంట్ / ప్యూన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.19,500/- జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం: 

BOB Office Assistant Recruitment 2025 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లో కెరీర్ విభాగంలో వెళ్లాలి. 
  • Present opportunities పై క్లిక్ చేసి దరఖాస్తు లింక్ పై క్లిక్ చేయండి. 
  • రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపండి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయండి. 
  • ఆన్ ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. 

ముఖ్యమైన తేదీలు : 

దరఖాస్తులు ప్రారంభ తేదీ03 – 05 -2025
దరఖాస్తులకు చివరి తేదీ23 – 05 – 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

1 thought on “BOB Office Assistant Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ప్యూన్ జాబ్స్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!