BISAG-N Young Professionals Recruitment 2025 : భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే భాస్కరాచార్య నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ (BISAG-N) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 17వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

BISAG-N Young Professionals Recruitment 2025 Overview
నియామక సంస్థ | భాస్కరాచార్య నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ (BISAG-N) |
పోస్టు పేరు | యంగ్ ప్రొఫెషనల్-1, యంగ్ ప్రొఫెషనల్-2 |
ఖాళీల సంఖ్య | 100 |
దరఖాస్తులకు చివరి తేదీ | 17 అక్టోబర్, 2025 |
జాబ్ లొకేషన్ | గుజరాత్ |
జాబ్ టైప్ | కాంట్రాక్ట్ బేస్డ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ |
Also Read : Central University of Karnataka Recruitment 2025 | CUKలో నాన్ టీచింగ్ జాబ్స్
ఖాళీల వివరాలు(Vacancy Details) :
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే స్వతంత్ర జాతీయ సంస్థ అయిన భాస్కరాచార్య నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ (BISAG-N) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడులైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి దేశంలోని అభ్యర్థులు అందరూ కూడా అప్లయ్ చేసుకోవచ్చు.
పోస్టు పేరు | ఖాళీలు |
Young Professional – I | 90 |
Young Professional – II | 10 |
మొత్తం | 100 |
అర్హతలు(Education Qualifications) :
BISAG-N Young Professionals Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతల్లో మార్పు ఉంటుంది.
Young Professional – I:
- B.E / B.Tech (Computer / Computer Science / Information Technology / Artificial Intelligence / Data Science)
- కనీసం 60% మార్కులు ఉండాలి
Young Professional – II:
- M.E / M.Tech (Computer / Computer Science / Information Technology / Artificial Intelligence / Data Science)
- కనీసం 60% మార్కులు ఉండాలి
వయోపరిమితి(Age Limit):
BISAG-N Young Professionals Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు దరఖాస్తు చివరి తేదీ నాటికి 22 నుంచి 26 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు (Application fees):
BISAG-N Young Professionals Recruitment 2025 నోటిఫికేషన్ లో అప్లికేషేన్ ఫీజు గురించి వివరాలు ఇవ్వలేదు. కాబట్టి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ(Selection Process):
BISAG-N Young Professionals Recruitment 2025 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక వీటిపై అధారపడి ఉంటుంది.
- ఆన్‌లైన్ అప్లికేషన్ పరిశీలన
- అవసరమైతే టెస్ట్ / ఇంటర్వ్యూ
- ఫైనల్ సెలెక్షన్ BISAG-N నిర్ణయం ప్రకారం
Also Read : CDAC Recruitment 2025: Apply Online for Project Engineer, Executive Director & Latest Vacancies
జీతం వివరాలు(Salary Details) :
BISAG-N Young Professionals Recruitment 2025 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు కన్సాలిడేటెడ్ జీతం ఇవ్వడం జరుగుతుంది.
- Young Professional – I: ₹30,000/-
- Young Professional – II: ₹42,000/-
- ప్రతి సంవత్సరం పనితీరును బట్టి గరిష్టంగా 10% ఇన్క్రిమెంట్ లభిస్తుంది.
- కాంట్రాక్ట్ 1 సంవత్సరం పాటు ఉంటుంది. పనితీరు బాగుంటే ప్రతి సంవత్సరం పొడిగిస్తూ 5 సంవత్సరాలు కొనసాగవచ్చు.
దరఖాస్తు విధానం(How to Apply) :
BISAG-N Young Professionals Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు BISAG-N అధికారిక వెబ్‌సైట్ www.bisag-n.gov.in ను సందర్శించాలి.
- అక్కడ లభించే Online Application Form ద్వారా రిజిస్టర్ అవ్వాలి.
- అర్హత సర్టిఫికేట్లు, అవసరమైన పత్రాలు స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
- అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి.
- ఏదైనా సవరణలు / Corrigendum BISAG-N వెబ్‌సైట్‌లో మాత్రమే విడుదల అవుతాయి.
దరఖాస్తులకు చివరి తేదీ : 17 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : GAIL Executive Trainee Recruitment 2026 | గేట్ స్కోర్ ఆధారంగా గ్యాస్ కంపెనీలో ఉద్యోగాలు
2 thoughts on “BISAG-N Young Professionals Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో 100 ఖాళీలు.. ఆన్ లైన్ అప్లయ్ చేసుకోండి.”