By Jahangir

Updated On:

Follow Us
BIS Young Professional Recruitment 2025

BIS Young Professional Recruitment 2025 | ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ జాబ్స్

BIS Young Professional Recruitment 2025 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్(BIS) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 05 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టుల వివరాలు : 

భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంస్థ దేశంలో ప్రామాణీకరణ, ఉత్పత్తి మరియు వ్యవస్థ ధృవీకరణ, హాల్‌మార్కింగ్, ప్రయోగశాల పరీక్ష మొదలైన రంగాలలోని కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది. యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. మొత్తం 05 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • పోస్టు పేరు : యంగ్ ప్రొఫెషనల్స్
  • ఖాళీల సంఖ్య : 05

అర్హతలు : 

BIS Young Professional Recruitment 2025 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సైన్సై లేదా ఇంజనీరింగ్ లో ఏదైనా డిగ్రి / బీఈ / బీటెక్ మరియు వీటితో పాటు ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. మార్కెటింగ్ లో 2 సంవత్సరాల అనుభవం ఉన్న వారికి ప్రాధానత్య ఇస్తారు.

వయస్సు : 

BIS Young Professional Recruitment 2025 అభ్యర్థులకు 35 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

BIS Young Professional Recruitment 2025  అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

BIS Young Professional Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింద దశల్లో జరుగుతుంది. 

  • అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్
  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ

జీతం : 

BIS Young Professional Recruitment 2025 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.70,000/-(కన్సాలిడేటెడ్) జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

BIS Young Professional Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అఫీషియన్ వెబ్ సైట్ ని ఓపెన్ చేయాలి. 
  • లాగిన్ అయ్యి ‘రిక్రూట్మెంట్ అప్లికేషన్’ – యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ – అప్లయ్ ఎస్ఆర్ఓ పై క్లిక్ చేయాలి. 
  • ఆన్ లైన్ అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • ఆ తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

దరఖాస్తులకు చివరి తేదీ : 05.09.2025

NotificationClick here
Apply OnlineClick here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

Follow Google News
error: Content is protected !!