BHEL Trichy Apprentice Notification 2025: తమిళనాడు రాష్ట్రం తిరుచ్చిరాపల్లిలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(BHEL) నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ ట్రేడ్, టెక్నీషియన్ మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 760 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెప్టెంబర్ 15వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి.

ఖాళీల వివరాలు :
భారత్ హెవీ వెహికల్ లిమిటెడ్ నుంచి వివిధ ట్రేడ్, టెక్నీషియన్ మరియు గ్రాడ్యుయేట్ కేటగిరీల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 760 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు : 550
ట్రేడ్ విభాగం | ఖాళీలు |
ఫిట్టర్ | 210 |
వెల్డర్ | 170 |
ఎలక్ట్రీషియన్ | 50 |
టర్నర్ | 30 |
మెషినిస్ట్ | 40 |
ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్ | 10 |
మోటార్ మెకానిక్ | 10 |
మెకానిక్ R&AC | 10 |
కోపా | 20 |
టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు : 90
విభాగం | ఖాళీలు |
మెకానికల్ ఇంజనీరింగ్ | 50 |
కంప్యూటర్ / ఐటీ ఇంజనీరింగ్ | 10 |
సివిల్ ఇంజనీరింగ్ | 10 |
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ | 10 |
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ | 10 |
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు : 120
విభాగం | ఖాళీలు |
మెకానికల్ ఇంజనీరింగ్ | 70 |
కంప్యూటర్ సైన్స్ / ఐటీ | 10 |
సివిల్ ఇంజనీరింగ్ | 10 |
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ | 5 |
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ | 5 |
అకౌంటెన్సీ(బీకాం) | 10 |
అసిస్టెంట్-హెచ్ఆర్ (బీఏ) | 10 |
Also Read : NHAI AI Engineer Recruitment 2025 | రూ.2.5 లక్షల జీతంతో జాబ్స్.. వెంటనే అప్లయ్ చేయండి.
అర్హతలు :
BHEL Trichy Apprentice Notification 2025 అప్రెంటిస్ పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి.
- ట్రేడ్ అప్రెంటిస్ : 10వ తరగతి ఉత్తీర్ణత + సంబంధత విభాగంలో ఐటీఐ
- టెక్నీషియన్ అప్రెంటిస్ : సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : ఇంజనీరింగ్ / టెక్నాలజీ / కామర్స్ / ఆర్ట్స్ లో డిగ్రీ ఉత్తీర్ణత. అభ్యర్థులు 2021 – 2025లో రెగ్యులర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి :
BHEL Trichy Apprentice Notification 2025 అభ్యర్థులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
BHEL Trichy Apprentice Notification 2025 అభ్యర్థుల ఎంపిక ఐటీఐ, డిప్లొమా మరియు డిగ్రీలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
Also Read : IB Security Assistant MT Jobs 2025 | ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
BHEL Trichy Apprentice Notification 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
- ట్రేడ్ అప్రెంటిస్ : రూ.10,700 – రూ.11,050/-
- టెక్నీషియన్ : రూ.11,000/-
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : రూ.12,000/-
దరఖాస్తు విధానం :
BHEL Trichy Apprentice Notification 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- Apprentice Recruitment 2025-26 పై క్లిక్ చేయాలి.
- అప్రెంటిస్ షిప్ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.
- అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ సబ్మిట్ చేసి, ప్రింట్ తీసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : 15 సెప్టెంబర్, 2025
Trade Apprentice Notification | Click here |
Technician Notification | Click here |
Graduate Notification | Click here |
Apply Online | Click here |