BHEL Recruitment 2025 భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇంజనీర్ మరియు సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 7వ తేదీ నుంచి ఆగస్టు 28వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
BHEL Recruitment 2025 Overview
నియామక సంస్థ | భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(BHEL) |
పోస్టు పేరు | ఇంజనీర్ మరియు సూపర్ వైజర్ |
పోస్టుల సంఖ్య | 12 |
దరఖాస్తు ప్రక్రియ | 7 ఆగస్టు – 28 ఆగస్టు, 2025 |
జాబ్ లొకేషన్ | హైదరాబాద్ |
ఖాళీల వివరాలు :
భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ నుంచి ఇంజనీర్ మరియు సూపర్ వైజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- ఇంజనీర్(మెకానికల్) : 02
- ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్) : 01
- సూపర్ వైజర్ (మెకానికల్) : 06
- సూపర్ వైజర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్) : 03
అర్హతలు మరియు అనుభవం :
BHEL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలతో పాటు సంబంధిత రంగాల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం కూడా కలిగి ఉండాలి.
పోస్టు పేరు | అర్హతలు |
ఇంజనీర్ (మెకానికల్) | మెకానికల్ లో బీఈ / బీటెక్ |
ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్) | ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్ లో బీఈ / బీటెక్ |
సూపర్ వైజర్ (మెకానికల్) | మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా |
సూపర్ వైజర్(ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్) | ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లో డిప్లొమా |
వయస్సు :
BHEL Recruitment 2025 అభ్యర్థులకు 01 ఆగస్టు, 2025 నాటికి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
BHEL Recruitment 2025 అభ్యర్థులు SBI e-Collect ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ : రూ.200/-
- ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ / ఎక్స్ సర్వీస్ మెన్ : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ:
BHEL Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- దరఖాస్తు స్క్రీనింగ్
- ఇంటర్వ్యూ
జీతం వివరాలు :
BHEL Recruitment 2025 అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది.
- ఇంజనీర్ పోస్టులకు : నెలకు రూ.84,000/-
- సూపర్ వైజర్ పోస్టులకు : నెలకు రూ.45,000/-
దరఖాస్తు విధానం :
BHEL Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- Recruitment of Experienced Engineer and Supervisors on fixed tenure basis లింక్ పై క్లిక్ చేయండి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్ పూరించాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
- హార్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకొని అవసరమైన పత్రాల స్వీయ ధ్రువీకరించబడిన కాపీలను పోస్ట్ ద్వారా కింది అడ్రస్ కి పంపాలి.
- అడ్రస్ : సీనియర్ మేనేజర్ / HR-RMX, HRM డిపార్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, BHEL, ఆర్సీ పురం, హైదరాబాద్ – 502032
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 07 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 28 ఆగస్టు, 2025
Notification | Click here |
Apply Online | Click here |