BEL Non Executive Recruitment 2025 : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ మరియు టెక్నీషియన్ – సి పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీ నుంచి అక్టోబర్ 29వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

BEL Non Executive Recruitment 2025 Overview
| నియామక సంస్థ | భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) |
| పోస్టు పేరు | ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీసియన్ ‘సి’ |
| పోస్టుల సంఖ్య | 30 |
| దరఖాస్తు ప్రక్రియ | 8 అక్టోబర్ – 29 అక్టోబర్, 2025 |
| దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
| ఎంపిక ప్రక్రియ | కంప్యూటర్ ఆధారిత పరీక్ష |
| జాబ్ లొకేషన్ | హైదరాబాద్, తెలంగాణ |
Also Read : SEBI Grade A Recruitment 2025 | భారీ జీతంతో SEBIలో బంపర్ జాబ్స్
ఖాళీల వివరాలు(Vacancy Details):
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తన ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ ల్యాండ్ సిస్టమ్స్, హైదరాబాద్ యూనిట్ కోసం ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ మరియు టెక్నీషియన్ ‘సి’ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఖాళీలు :
- ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ : 06
- మెకానికల్ : 08
- ఎలక్ట్రికల్ : 01
టెక్నీషియన్ ‘సి’ ఖాళీలు:
- ఫిట్టర్ : 4
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ : 07
- మెషినిస్ట్ : 02
- ఎలక్ట్రీషియన్ : 02
అర్హతలు(Eligibility :
BEL Non Executive Recruitment 2025 పోస్టులకు పోస్టును అనుసరించి విద్యార్హతలు మారుతాయి.
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ : సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా
- టెక్నీషియన్ ‘సి’ : SSLC + ITI + ఒక సంవత్సరం అప్రెంటిస్ (లేదా) SSLC + సంబంధిత ట్రేడ్ లో 3 సంవత్సరాల NAC
వయోపరిమితి(Age Limit) :
BEL Non Executive Recruitment 2025 అభ్యర్థులకు 01.10.2025 నాటికి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు(Application Fees) :
BEL Non Executive Recruitment 2025 అభ్యర్థులు SBI కలెక్ట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- జనరల్ / ఓబీసీ / EWS : రూ.590/-
- ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / ఎక్స్ సర్వీస్మెన్ : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ BEL Selection Process) :
BEL Non Executive Recruitment 2025 ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ మరియు టెక్నీషియన్ ‘సి’ పోస్టులకు అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక
Also Read : Army DG EME Secunderabad Recruitment 2025 | సికింద్రాబాద్ ఆర్మీలో బంపర్ జాబ్స్
జీతం వివరాలు(Salary Details) :
BEL Non Executive Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ : రూ.24,500 – రూ.90,000/-
- టెక్నీషియన్ ‘సి’ : రూ.21,500 – రూ.82,000/-
దరఖాస్తు విధానం(How to Apply):
BEL Non Executive Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు https://bel-india.in అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో కెరీర్ విభాగంలో జాబ్ నోటిఫికేషన్స్ లో వెళ్లాలి.
- BEL Non Executive Recruitment 2025 వద్ద ఆన్ లైన్ అప్లయ్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- SBI కలెక్ట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 8 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 29 అక్టోబర్, 2025
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : Indian Army TES 55 Recruitment 2025 | ఇంటర్ అర్హతతో ఆర్మీలో ఆఫీసర్ జాబ్స్
2 thoughts on “BEL Non Executive Recruitment 2025 | BEL హైదరాబాద్ లో బంపర్ జాబ్స్”