BEL Graduate Apprentice Recruitment 2025 | భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టులు

BEL Graduate Apprentice Recruitment 2025 భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వాక్ ఇన్ రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 200 పైగా ఖాళీలు ఉన్నాయి. 

BEL Graduate Apprentice Recruitment 2025 Overview : 

నియామక సంస్థభారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)
పోస్టు పేరుగ్రాడ్యుయేట్ అప్రెంటీస్
పోస్టుల సంఖ్యఖచ్చితమైన ఖాళీలు పేర్కొనబడలేదు. 200 పైగా ఉండవచ్చు.
లొకేషన్జలహల్లి, బెంగళూరు
అప్రెంటీస్ షిప్ వ్యవధిఒక సంవత్సరం

పోస్టుల వివరాలు : 

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడదల చేయడం జరిగింది. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. 

  • అప్రెంటీస్ విభాగాలు : ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్  అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్,  ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇన్ఫర్మేషన్  టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ / సివిల్ ఆర్కిటెక్చర్, కెమికల్ ఇంజనీరింగ్.

అర్హతలు : 

BEL Graduate Apprentice Recruitment 2025 పోస్టులకు సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో పూర్తి సమయం BE / B.Tech ఉత్తీర్ణులై ఉండాలి. 

  • BE / B.Tech
  • అభ్యర్థులు జనవరి 1, 2021న లేదా ఆ తర్వాత పట్టభద్రులై ఉండాలి. 
  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ,  ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలి.

వయస్సు : 

BEL Graduate Apprentice Recruitment 2025  అభ్యర్థులకు వాక్ ఇన్ పరీక్ష తేదీ నాటికి 25 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు,  ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

రెసిడెన్షియల్ ఎలిజిబిలిటీ : 

BEL Graduate Apprentice Recruitment 2025 ఈ నోటిఫికేషన్ ప్రత్యేకంగా దక్షిణ  భారతదేశానికి చెందిన అభ్యర్థులకు మాత్రమే.  కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ లేదా పాండిచ్చేరి అభ్యర్థులు వాక్ ఇన్ పరీక్షకు హాజరకావచ్చు. 

అప్లికేషన్ ఫీజు : 

BEL Graduate Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ: 

BEL Graduate Apprentice Recruitment 2025  అప్రెంటిస్ పోస్టులకు ఎంపిక విధానం రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. 

  • వాక్ ఇన్ మరియు రిజిస్ట్రేషన్ : అభ్యర్థులకు వాక్ ఇన్ తేదీ సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. 
  • రాత పరీక్ష: రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులందరికీ  రాత పరీక్ష నిర్వహిస్తారు. 
  • మెరిటి లిస్ట్ : రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల మెరిటి లిస్ట్ రూపొందించడం జరుగుతుంది. 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ : మెరిట్ లిస్ట్ లో షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థుల ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.

స్టైఫండ్ వివరాలు : 

BEL Graduate Apprentice Recruitment 2025 అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ షిప్ ఉంటుంది. ఈ సమయంలో అభ్యర్థులకు నెలవారీ స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 

  • స్టైఫండ్ : రూ.17,500/-(కన్సాలిడేటెడ్)

దరఖాస్తు విధానం : 

BEL Graduate Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన  అవసరం లేదు. సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల అభ్యర్థులు జూలై 4 మరియు జూలై 7వ తేదీన వాక్ ఇన్ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. 

వాక్ ఇన్ పరీక్ష తేదీలు : 

విభాగాలుతేదీ మరియు సమయం
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ కంప్యూటర్ ఇంజనీరింగ్04 జూలై, 2025(9:30 AM – 11:00 AM)
కంప్యూటర్ సైన్స్,  కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ04 జూలై, 2025(01:30 PM – 04:00 PM)
మెకానికల్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ / సివిల్ ఆర్కిటెక్చర్, కెమికల్ ఇంజనీరింగ్07 జూలై, 2025(09:30 AM – 11:00 AM)

కావాల్సిన పత్రాలు : 

  • 10వ తరగతి సర్టిఫికెట్ (డేట్ ఆఫ్ ప్రూఫ్)
  • బీఈ / బీటెక్ సర్టిఫికెట్ లేదా ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికెట్
  • అన్ని సెమిస్టర్ మార్సుల షీట్లు
  • ఆధార్ కార్డు
  • కులం / వైకల్య సర్టిఫికెట్
  • ఇటీవలి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో (కనీసం 2-3) 
NotificationClick here
Official WebsiteClick here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!