BEL CRL Recruitment 2025: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఘజియాబాద్ లోని సెంట్రల్ రీసెర్చ్ లాబొరేటరీ యూనిట్ లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ట్రైనీ ఇంజనీర్-1 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాత్కాలిక ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 26వ తేదీన జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

BEL CRL Recruitment 2025 Overview
నియామక సంస్థ | భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ |
పోస్టు పేరు | ట్రైనీ ఇంజనీర్ |
ఖాళీల సంఖ్య | 35 |
దరఖాస్తు విధానం | వాక్ ఇన్ ఇంటర్వ్యూ |
వాక్ ఇంటర్వ్యూ తేదీలు | 26 సెప్టెంబర్, 2025 |
జాబ్ లొకేషన్ | ఘజియాబాద్, యూపీ |
Also Read : ARIES Administrative and Technical Recruitment 2025 | ఆర్యభట్ట ఇన్ స్టిట్యూట్ లో బంపర్ నోటిఫిషన్
ఖాళీల వివరాలు :
ఘజియాబాద్ లోని సెంట్రల్ రీసెర్చ్ లాబొరేటరీ(CRL) కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుంచి ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక (Temporary Basis) పై జరుగుతాయి. మొదట 2 సంవత్సరాల కాలానికి నియామకం ఉండి, ప్రాజెక్ట్ అవసరం మరియు వ్యక్తిగత ప్రదర్శన ఆధారంగా గరిష్టంగా 3 సంవత్సరాల వరకు పొడిగించబడుతుంది.
- పోస్టు పేరు : ట్రైనీ ఇంజనీర్-1
- పోస్టుల సంఖ్య : 35
అర్హతలు :
BEL CRL Recruitment 2025 అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బీఈ / బీటెక్ ఉత్తీర్ణత సాధించాలి.
- B.E / B.Tech (4 years) Computer Science / IT / Software Engineering / Cyber Security / Networking వంటి సంబంధిత విభాగాల్లో డిగ్రీ ఉండాలి.
- Fresher అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- C++, Java, Python, Algorithm Development, Software Testing, Documentation లాంటి విషయాలలో జ్ఞానం ఉంటే అదనపు ప్రయోజనం.
వయోపరిమితి :
BEL CRL Recruitment 2025 అభ్యర్థులకు 01.09.2025 నాటికి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
BEL CRL Recruitment 2025 అభ్యర్థులు SBI Collect ద్వారా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.177/-
- ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ:
BEL CRL Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. సెప్టెంబర్ 26వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరుగుతుంది.
జీతం వివరాలు :
BEL CRL Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం చెల్లించడం జరుగుతుంది.
- 1వ సంవత్సరం: ₹30,000/- ప్రతినెల
- 2వ సంవత్సరం: ₹35,000/- ప్రతినెల
- 3వ సంవత్సరం: ₹40,000/- ప్రతినెల
దరఖాస్తు విధానం :
BEL CRL Recruitment 2025 అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు BEL వెబ్‌సైట్ www.bel-india.in ని సందర్శించాలి.
- నోటిఫికేషన్ లో ఇచ్చిన వివరాలు పూర్తిగా చదవాలి.
- అభ్యర్థులు సెప్టెంబర్ 24వ తేదీలోపు Pre-registration చేసుకోవాలి.
- సెప్టెంబర్ 26న వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
- అవసరమైన అన్ని సర్టిఫికెట్లు (Original + Xerox), 2 Passport Photos మరియు ఫీజు చెల్లింపు రసీదు వెంట తీసుకురావాలి.
Pre-registration విధానం :
- నోటిఫికేషన్‌లో ఇచ్చిన QR Code / Link ద్వారా మీరు Pre-registration Page కి వెళ్లాలి.
- అక్కడ మీ పర్సనల్ డీటైల్స్ (పేరు, DOB, Category, Mobile Number, Email ID) ఫిల్ చేయాలి.
- మీ ఎడ్యుకేషనల్ వివరాలు (Degree, Branch, Percentage, Passing Year) నమోదు చేయాలి.
- అవసరమైతే మీ Work Experience కూడా mention చేయాలి.
- చివరగా Application Fee SBI Collect ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించి రసీదు సేవ్ చేసుకోవాలి.
- ఫారమ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు Registration Confirmation Slip/ID వస్తుంది – దాన్ని Print తీసుకోవాలి.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ వేదిక :
- Central Research Laboratory, Ghaziabad
- రిపోర్టింగ్ సమయం: ఉదయం 08:00 గంటలలోపు
ముఖ్యమైన తేదీలు :
- ప్రీ రిజిస్ట్రేషన్ తేదీ : 24.09.2025
- వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ : 26.09.2025
Notification | Click here |
Official Website | Click here |
Also Read : DRDO ITR Apprentice Recruitment 2025 | గ్రాడ్యుయేట్ & డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్