BDL MT Recruitment 2025 రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని మినిరత్న కేటగిరీ-1 ప్రభుత్వ రంగ సంస్థ Bharat Dynamic Limited(BDL) మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, ఫైనాన్స్ మరియు మరిన్ని విభాగాల్లో వివిధ రకాల మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 49 ఖాళీలు ఉన్నాయి. ఫిబ్రవరి 21వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇలాంటి నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఉద్యోగాల కోసం ప్రీపేర్ అవుతున్న అభ్యర్థులు కొన్ని పోస్టులే కదా అని అస్సలు వదులుకోవద్దు. ఒకసారి ఉద్యోగం కొడితే లైఫ్ సెట్ అయిపోతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోండి.
BDL MT Recruitment 2025
పోస్టుల వివరాలు :
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 49 పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీలు ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, ఫైనాన్స్ మరిన్ని విభాగాల్లో ఖాళీలు ప్రకటించారు.
పోస్టుల కేటాయింపులు :
● MT (ఎలక్ట్రానిక్స్) గ్రేడ్ 2 – 15 పోస్టులు
● MT (మెకానికల్) గ్రేడ్ 2 – 10 పోస్టులు
● MT (ఎలక్ట్రికల్) గ్రేడ్ 2 – 04
● MT (సైబర్ సెక్యూరిటీ) గ్రేడ్ 2 – 02
● MT (కంప్యూటర్ సైన్స్) గ్రేడ్ 2 – 01
● MT (కెమికల్) గ్రేడ్ 2 – 01
● MT (సివిల్) గ్రేడ్ 2 – 02
● MT (బిజినెస్ డెవలప్ మెంట్) గ్రేడ్ 2 – 02
● MT (పబ్లిక్ రిలేషన్) గ్రేడ్ 2 – 01
● MT (ఫైనాన్స్) గ్రేడ్ 2 – 04
● MT (హెచ్ఆర్) గ్రేడ్ 2- 02
● MT (అపీషియల్ లాంగ్వేజ్) గ్రేడ్ 2 – 01
● అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) గ్రేడ్ 2 – 01
● సీనియర్ మేనేజర్ (లీగల్) గ్రేడ్ 5 – 01
● డిప్యూటీ జనరల్ మేనేజర్ గ్రేడ్ 6 – 01
SCR Railway Recruitment 2025 | సికింద్రాబాద్ రైల్వే లో జాబ్స్ | పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగం
అర్హతలు :
BDL MT Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేేసే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. లేదా తత్సమానమైన 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులు చేసి ఉండాలి. కొన్ని ఉద్యోగాలకు సర్టిఫికేషన్ కోర్సులు అవసరం అవుతాయి. ఉదాహరణకు సైబర్ సెక్యురిటీ ఉద్యోగం కోసం సైబర్ సెక్యురిటీలో సర్టిఫికెట్ అవసరం.
వయస్సు :
BDL MT Recruitment 2025 జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు మించకూడదు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 28 ఏళ్లు, సీనియర్ మేనేజర్ పోస్టుకు 45 ఏళ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
జీతం :
BDL MT Recruitment 2025 గ్రేడ్ 2 లెవెల్ పోస్టులకు రూ.40,000/- నుంచి రూ.1,40,000/- వరకు జీతం ఉంటుంది. అదే గ్రేడ్ 5 లెవెల్ పోస్టుకు రూ.70,0000/- నుంచి రూ.2,00,000/- వరకు, గ్రేడ్ 6 లెవెల్ పోస్టుకు రూ.80,000/- నుంచి రూ.2,20,000/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :
BDL MT Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే జనరల్ / OBC / EWS అభ్యర్థులకు రూ.500/- ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు మినహాయింపు ఉంది. ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ :
BDL MT Recruitment 2025 భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది.
● కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
● వ్యక్తిగత ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం :
BDL MT Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : 21 ఫిబ్రవరి 2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE
1 thought on “BDL MT Recruitment 2025 | రక్షణ మంత్రిత్వ శాఖలో జాబ్స్”