BDL Apprentice Notification 2025 | భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో 110 ఖాళీలు

BDL Apprentice Notification 2025 : భారత రక్షణ శాఖకు చెందిన భారత డైనమిక్స్ లిమిటెడ్ (Bharat Dynamics Limited – BDL) సంస్థ, తెలంగాణ రాష్ట్రంలోని భానూర్ యూనిట్‌ ద్వారా ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 110 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఖాళీల వివరాలు (BDL Apprentice Notification 2025 Vacancy Details) : 

ఈ నియామకంలో మొత్తం 110 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వివిధ ట్రేడ్ల వారీగా ఖాళీల వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

  • ఫిట్టర్ (Fitter) – 33 పోస్టులు
  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్ (Electronics Mechanic) – 22 పోస్టులు
  • మెషినిస్ట్ (CNC / General) – 12 పోస్టులు
  • వెల్డర్ (Welder) – 6 పోస్టులు
    డీజిల్ మెకానిక్ (Mechanic Diesel) – 2 పోస్టులు
  • ఎలక్ట్రిషియన్ (Electrician) – 6 పోస్టులు
  • టర్నర్ (Turner) – 8 పోస్టులు
  • కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) – 16 పోస్టులు
  • ప్లంబర్ (Plumber) – 1 పోస్టు
  • కార్పెంటర్ (Carpenter) – 1 పోస్టు
  • రిఫ్రిజరేషన్ & ఎయిర్ కండీషనింగ్ (RAC) – 2 పోస్టులు
  • LACP – 1 పోస్టు

Also Read : MOIL Recruitment 2025 | మాంగనీస్ ఓర్ ఇండియాలో జాబ్స్

అర్హతలు (BDL Apprentice Notification 2025 Educational Qualification) : 

  • అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి అయి ఉండాలి.
  • సంబంధిత ట్రేడ్‌లో ITI (NCVT/SCVT) సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి (BDL Apprentice Notification 2025 Age Limit) : 

అభ్యర్థులకు 30.09.2025 నాటికి 14 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

ఎంపిక విధానం (BDL Apprentice Notification 2025 Selection Process) : 

అభ్యర్థులు ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. 10వ తరగతి (SSC) మరియు ITI మార్కులకు సమాన వెయిటేజ్ (50% + 50%) ఇవ్వబడుతుంది. ట్రేడ్‌ వారీగా వేర్వేరు మెరిట్ జాబితాలు తయారు చేయబడతాయి.ఎంపికైన అభ్యర్థులు మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే తుది ఎంపిక పొందుతారు.

  • మెరిట్ ఆధారంగా ఎంపిక
  • మెడికల్ ఎగ్జామినేషన్

Also Read : BRO Jobs 2025 Notification  | రోడ్స్ ఆర్గనైజేషన్ లో బంపర్ జాబ్స్ – 542 ఖాళీలు

స్టైఫండ్ వివరాలు (BDL Apprentice Notification 2025 Stipend Details) : 

ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో కేంద్ర అప్రెంటిస్ షిప్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం నెలవారీ స్టైపెండ్ చెల్లించబడుతుంది.  జీతం (స్టైపెండ్) రేట్లు BDL నిబంధనల ప్రకారం ఉంటాయి.

దరఖాస్తు విధానం (BDL Apprentice Notification 2025 How to Apply)  

  • అభ్యర్థులు ముందుగా https://apprenticeshipindia.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ సమయంలో పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, విద్యార్హత వివరాలు సరిగా నమోదు చేయాలి.
  • రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, “Establishment Search” ఎంపిక చేసి Bharat Dynamics Limited, Bhanur (Reg. No: E06203600009) ఎంపిక చేసి “Apply” చేయాలి.
  • 10వ తరగతి మార్క్‌లిస్ట్, ITI సర్టిఫికేట్, ఫోటో స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
  • చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు: 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 16 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 30 అక్టోబర్, 2025
NotificationClick here
Apply onlineClick here

Also Read : CWC Recruitment 2025 | సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో జాబ్స్

2 thoughts on “BDL Apprentice Notification 2025 | భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో 110 ఖాళీలు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!