Bank of Baroda Apprentices Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) లో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా 4,000 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా ఉద్యోగాలు ఉన్నాయి. అభ్యర్థులు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 20 నుంచి 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ పోస్టులను దేశవ్యాప్తంగా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి నోటిఫికేషన్ చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
Bank of Baroda Apprentices Recruitment 2025
పోస్టుల వివరాలు :
Bank of Baroda Apprentices పోస్టులు మొత్తం 4,000 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 59 పోస్టులు, తెలంగాణలో 193 పోస్టులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా పోస్టులను బట్టి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు :
Bank of Baroda Apprentices Recruitment 2025 పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు :
Bank of Baroda Apprentices Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేేసే అభ్యర్థులకు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
Indian Army NCC Special Entry Recruitment 2025 | ఇండియన్ ఆర్మీలో NCC స్పెషల్ ఎంట్రీ జాబ్స్
దరఖాస్తు ఫీజు :
Bank of Baroda Apprentices Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే UR / OBC / EWS అభ్యర్థులు రూ.800/-, ఎస్సీ / ఎస్టీ / మహిళలు రూ.600/-, PWBD అభ్యర్థులు రూ.400/- ఫీజు చెల్లించాలి. ఫీజును ఆన్ లైన్ పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
Bank of Baroda Apprentices Recruitment 2025 అప్రెంటీస్ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ కింద దశల్లో జరుగుతుంది.
● ఆన్ లైన్ రాత పరీక్ష
● డాక్యుమెంట్ వెరిఫికేషన్
● లాంగ్వేజ్ ప్రొఫెషియన్సీ టెస్ట్
● మెడికల్ టెస్ట్
రాత పరీక్ష విధానం:
Bank of Baroda Apprentices Recruitment 2025 ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. 60 నిమిషాల సమయం ఇస్తారు.
● జనరల్ / ఫైనాన్షియల్ అవేర్ నెస్ – 25 మార్కులు
● క్వాంపిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ – 25 మార్కులు
● కంప్యూటర్ నాలెడ్జ్ – 25 మార్కులు
● జనరల్ ఇంగ్లీష్ – 25 మార్కులు
జీతం :
Bank of Baroda Apprentices Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో రూ.15,000/- స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
Bank of Baroda Apprentices Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా మార్చి 11వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
● ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 19 – 02- 2025
● ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 19 – 03 – 2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE
Official Website : CLICK HERE
1 thought on “Bank of Baroda Recruitment 2025 | Bank of Baroda లో 4,000 జాబ్స్ | Any డిగ్రీ Pass”