Bank of Baroda HR Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. Receivables Management Departmentలో వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 82 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని పోస్టులు ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఆధారంగా భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 19వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు :
బ్యాంక్ ఆఫ్ బరోడా నియామక ప్రక్రియలో Zonal Receivables Manager, Regional Receivables Manager, Area Receivables Manager, Compliance Manager, Complaint Manager, Process Manager, Vendor Manager, Floor Manager వంటి మొత్తం 8 విభాగాలలో 82 పోస్టులు ఉన్నాయి.
- Zonal Receivables Manager – 13
- Regional Receivables Manager – 13
- Area Receivables Manager – 49
- Compliance Manager – 1
- Complaint Manager – 1
- Process Manager – 1
- Vendor Manager – 1
- Floor Manager – 3
Also Read : IB MTS Recruitment 2025 | 10వ తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్స్
అర్హతలు :
Bank of Baroda HR Recruitment 2025 ప్రతి పోస్టుకూ కనీసం గ్రాడ్యుయేషన్ తప్పనిసరి, అయితే MBA/PG Diploma వంటి అదనపు విద్యార్హతలు ఉండాలి. పోస్టులనుబట్టి 5 నుండి 15 సంవత్సరాల వరకూ సంబంధిత బ్యాంకింగ్, NBFC, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి :
Bank of Baroda HR Recruitment 2025 పోస్టులనుబట్టి కనీసం 25 నుంచి గరిష్ఠం 52 సంవత్సరాల మించకుండ వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
Bank of Baroda HR Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- UR / OBC / EWS అభ్యర్థులు: ₹850/-
- SC / ST / PWD / ESM / Women అభ్యర్థులు: ₹175/-
ఎంపిక ప్రక్రియ:
Bank of Baroda HR Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. అవసరమైతే బ్యాంక్ అదనపు సెలెక్షన్ స్టెప్స్ కూడా అమలు చేయవచ్చు. షార్ట్‌లిస్టింగ్ పూర్తిగా అభ్యర్థుల అనుభవం, అర్హత, మొత్తం సూటబిలిటీపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులు బ్యాంక్ నిర్ణయిస్తుంది.
- స్క్రీనింగ్
- పర్సనల్ ఇంటర్వ్యూ
Also Read : Indian Army Sports Quota Recruitment 2025 | క్రీడాకారులకు ఆర్మీలో బంపర్ జాబ్స్
జీతం వివరాలు :
Bank of Baroda HR Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు క్వాలిఫికేషన్, అనుభవం, గత సాలరీ, మార్కెట్ స్టాండర్డ్స్ ఆధారంగా ఇస్తారు. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాబట్టి అభ్యర్థులను మొదట 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇస్తారు. పనితీరు ఆధారంగా 5 సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంది. మొత్తం కాంట్రాక్ట్ వ్యవధి 10 సంవత్సరాలు మించదు. అలాగే కాంట్రాక్ట్ 60 ఏళ్ల వయసు దాటే వరకు మాత్రమే చెల్లుతుంది.
దరఖాస్తు విధానం :
Bank of Baroda HR Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ Bank of Baroda Careers → Current Opportunities లో వెళ్లాలి. అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 19 నవంబర్ 2025
- ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 09 డిసెంబర్ 2025
| Notification | Click here |
| Apply Online | Click here |
FAQs
1. ఈ రిక్రూట్మెంట్‌లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి?
మొత్తం 82 పోస్టులు ఉన్నాయి.
2. కాంట్రాక్ట్ వ్యవధి ఎంత?
మొదట 5 సంవత్సరాలు, తరువాత పనితీరును బట్టి మొత్తం 10 సంవత్సరాలు వరకు పొడిగించవచ్చు.
3. వయోపరిమితి ఎంత?
పోస్ట్ ప్రకారం కనీసం 25–52 సంవత్సరాల మధ్య. రిజర్వేషనుకు అనుగుణంగా వయస్సులో రీలాక్సేషన్ ఉంటుంది.
4. ఎంపిక ఎలా జరుగుతుంది?
Shortlisting + Personal Interview ఆధారంగా సెలెక్షన్ జరుగుతుంది. ఇతర టెస్ట్‌లు అవసరమైతే బ్యాంక్ చేర్చవచ్చు.