Assam Rifles Sports Quota Recruitment 2025 డైరెక్టరేట్ జనరల్ అస్సాం రైఫిల్స్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. స్సోర్ట్స్ కోటా కింది రైఫిల్ మెన్ / రైఫిల్ ఉమెన్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 69 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల కోసం నియామక ర్యాలీ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య నిర్వహించబడుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 16వ తేదీ నంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు :
అస్సాం రైఫిల్స్ నుంచి వివిధ క్రీడా విభాగాల్లో రైఫిల్ మెన్ మరియు రైఫిల్ ఉమెన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 69 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
క్రీడా విభాగం | పురుషులు | మహిళలు |
బాక్సింగ్ | 3 | 3 |
ఫుట్ బాల్ | 5 | 4 |
షూటింగ్ | 2 | 2 |
తైక్వాండో | 4 | 4 |
కరాటే | 4 | 6 |
సెపక్తక్రా | 2 | 0 |
ఫెన్సింగ్ | 1 | 4 |
పెన్ కాక్ సిలాట్ | 3 | 7 |
అథ్లెటిక్స్ | 4 | 7 |
అర్హతలు :
Assam Rifles Sports Quota Recruitment 2025 అస్సాం రైఫిల్స్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మరియు అభ్యర్థులు క్రీడాకారుడై ఉండాలి.
- 10వ తరగతి ఉత్తీర్ణత + స్పోర్ట్స్ మెన్
- ఇంటర్నేషల్ కాంపిటిషన్స్, నేషనల్ కాంపిటిషన్స్, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్, స్కూల్ లెవల్ నేషనల్ గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లేదా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్.
వయోపరిమితి :
Assam Rifles Sports Quota Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
Assam Rifles Sports Quota Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ లేదా ఎస్బీఐ చలాన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
కేటగిరి | ఫీజు |
జనరల్ / ఓబీసీ | రూ.100/- |
ఎస్సీ / ఎస్టీ / మహిళలు | ఫీజు లేదు |
ఎంపిక ప్రక్రియ:
Assam Rifles Sports Quota Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- డాక్యుమెంటేషన్
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
- మోటార్ ఎబిలిటి టెస్ట్
- ఫీల్డ్ ట్రైల్స్
- మెడికల్ ఎగ్జామినేషన్
జీతం వివరాలు :
Assam Rifles Sports Quota Recruitment 2025 అస్సాం రైఫిల్స్ స్పోర్ట్స కోటాలో ఎంపికైన అభ్యర్థులకు 7వ సీపీసీ ప్రకారం జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
Assam Rifles Sports Quota Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు మరియు ఫీజు రషీదు / చలాన్ అప్ లోడ్ చేయాలి.
- తర్వాత అప్లికేషన్ ఫారమ్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 16 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 15 సెప్టెంబర్, 2025
Notification | Click here |
Official Website | Click here |