Army DG EME Secunderabad Recruitment 2025 : ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ నుంచి మరో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్ – సి సివిలియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 69 పోస్టలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలు తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ లో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

Army DG EME Secunderabad Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఇండియన్ ఆర్మీ DG EME |
పోస్టు పేర్లు | జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్, స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, వాషర్ మ్యాన్/ధోబి |
పోస్టుల సంఖ్య | 69 |
దరఖాస్తు ప్రక్రియ | 11 అక్టోబర్ – 14 నవంబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆఫ్ లైన్ |
జాబ్ లొకేషన్ | సికింద్రాబాద్(తెలంగాణ) |
Also Read : Indian Army TES 55 Recruitment 2025 | ఇంటర్ అర్హతతో ఆర్మీలో ఆఫీసర్ జాబ్స్
ఖాళీల వివరాలు(Vacancy Details):
ఇండియన్ ఆర్మీలో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కార్ప్స్(EME) అనేది ఒక కీలకమైన విభాగం. ఈ విభాగం అన్ని యాంత్రిక మరియు ఎలక్ట్రానిక్స్ పరికరాల నిర్వహణ, మరమ్మతు మరియు పునరుద్ధరణకు బాధ్యత వహిస్తుంది. ఈ విభాగంలో నుంచి వివిధ గ్రూప్ – సి సివిలియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 69 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్ | 02 |
స్టెనోగ్రాఫ్ గ్రేడ్-2 | 02 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS) | 37 |
వాషర్ మ్యాన్ / ధోబి | 03 |
లోయర్ డివిజన్ క్లర్క్(LDC) | 25 |
మొత్తం | 69 |
అర్హతలు(Eligibility) :
Army DG EME Secunderabad Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టును అనుసరించి విద్యార్హతల్లో మార్పు ఉంటుంది.
పోస్టు పేరు | విద్యార్హతలు |
జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్(JTTI) | ఫిజిక్స్ మరియు మ్యాథ్స్ తో BSc ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం. |
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 | 12వ తరగతి ఉత్తీర్ణత |
లోయర్ డివిజన్ క్లర్క్ | 12వ తరగతి + కంప్యూటర్ లో ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు టైపింగ్ స్పీడ్ లేదా కంప్యూటర్ లో హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | 10వ తరగతి ఉత్తీర్ణత |
వాషర్ మ్యాన్ / ధోబి | 10వ తరగతి ఉత్తీర్ణత |
వయోపరిమితి(Age Limit) :
Army DG EME Secunderabad Recruitment 2025 పోస్టులను బట్టి అభ్యర్థుల వయోపరిమితి మారుతుంది.
- జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్ : 21 నుంచి 30 సంవత్సరాలు
- స్టెనోగ్రాఫర్, LDC, MTS & వాషర్ మ్యాన్ : 18 నుంచి 25 సంవత్సరాలు
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు(Application Fees) :
Army DG EME Secunderabad Recruitment 2025 నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు గురించి ప్రస్తావిచలేదు. కాబట్టి అన్ని కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ(Selection Process) :
Army DG EME Secunderabad Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్ (స్టెనో, LDC పోస్టులకు)
Also Read : Indian Army TGC-143 Recruitment 2025 | ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్
జీతం వివరాలు(Salary Details) :
Army DG EME Secunderabad Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును అనుసరించి జీతం నిర్ణయించారు.
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : రూ.18,000 – రూ.56,900 (పే లెవల్ -1)
- లోయర్ డివిజన్ క్లర్క్ : రూ.21,700 – రూ.69,100 (పే లెవల్ -2)
- జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్ : రూ.25,500 – రూ.81,100 (పే లెవల్-4)
దరఖాస్తు విధానం(How to Apply) :
Army DG EME Secunderabad Recruitment 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తులు సమర్పించుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా బ్లాక్ లెటర్స్ లో నింపాలి.
- అప్లికేషన్ లో ఇటీవలి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో గ్రాఫ్ ను అతికించాలి.
- అప్లికేషన్ ఫారమ్ తో పాట అవసరమైన అన్ని స్వీయ ధ్రువీకరించబడిన పత్రాలను జత చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ మరియు అన్ని ఎన్ క్లోజర్లను ఒక కవరులో ఉంచండి.
- అప్లికేషన్ ను ఆర్డినరీ పోస్ట్ ద్వారా కింది అడ్రస్ కి పంపాలి.
దరఖాస్తు పంపాల్సిన అడ్రస్ :
- కమాండెంట్, 1 EME సెంటర్, సికింద్రాబాద్, తెలంగాణ – 500087
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 11 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 14 నవంబర్, 2025
Notification | Click here |
Official Website | Click here |
Also Read : RRC ECR Sports Quota Recruitment 2025 | స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో జాబ్స్
1 thought on “Army DG EME Secunderabad Recruitment 2025 | సికింద్రాబాద్ ఆర్మీలో బంపర్ జాబ్స్”