APSRTC Apprentice Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల పరిధిలో వివిధ ట్రేడ్లలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 281 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు :
APSRTCలో వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ వెల్డర్, పెయింటర్, మెషనిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం 281 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ట్రేడ్స్ మరియు జిల్లాల వారీగా ఖాళీల వివరాలు
ట్రేడ్ పేరు | చిత్తూరు | తిరుపతి | నెల్లూరు | ప్రకాశం |
డీజిల్ మెకానిక్ | 33 | 60 | 62 | 37 |
మోటార్ మెకానికల్ | 2 | 4 | 3 | 2 |
ఎలక్ట్రీషియన్ | 8 | 15 | 14 | 9 |
వెల్డర్ | 1 | 2 | 2 | 1 |
పెయింటర్ | 1 | 1 | 1 | 1 |
మెషనిస్ట్ | 0 | 0 | 1 | 0 |
ఫిట్టర్ | 3 | 5 | 7 | 3 |
డ్రాఫ్ట్స్ మెన్ | 0 | 1 | 1 | 1 |
Also Read : APPSC Junior Lecturer Notification 2025 | ఏపీలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు
అర్హతలు :
APSRTC Apprentice Recruitment 2025 అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
APSRTC Apprentice Recruitment 2025 అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.118/- ఆఫ్ లైన్ ద్వారా చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ:
APSRTC Apprentice Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుది.
దరఖాస్తు విధానం :
APSRTC Apprentice Recruitment 2025 అభ్యర్థులు www.apprenticeshipindia.gov.in వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి అప్రంటిస్ షిప్ చేయాలనుకున్న జిల్లాను ఎంచుకొని పోర్టల్ ద్వారా అప్లయ్ చేయాలి.
- ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెంటనే ఈ కింద తెలిపిన certificates జిరాక్స్ కాపీలను సంబంధిత కార్యాలయానికి 06.10.2025 తేదీలోగా పంపాలి. సర్టిఫికేట్స్ తో పాటు ఒక “RESUME” కూడా పంపాలి.
పంపాల్సిన సర్టిఫికెట్లు :
- ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థి యెక్క ప్రొఫైల్
- www.apprenticeshipindia.gov.in పోర్టల్ లో Apprenticeship Registraton Number(ARN).
- అభ్యర్థి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసినట్లు గా రుజువు
- S.S.C Marks list.
- I.T.I. Marks (Consolidated Marks Memo)
- NCVT Certificate
- కుల ధృవీకరణ పత్రము – SC/ST/BC (పర్మనెంట్ సర్టిఫికేట్ లేనియెడల ఆరు నెలల లోపు జారీ చేయబడిన తాత్కాలికకుల ధృవీకరణ పత్రము)
- వికలాంగులైతే ధృవీకరణ పత్రము
- మాజీ సైనికోద్యోగుల పిల్లలైతే ధృవీకరణ పత్రము
- NCC మరియు Sports ఉంటే సంబందిత ధృవీకరణ పత్రము లు
- ఆధార్ కార్డు.
సర్టిఫికెట్లు పంపాల్సిన అడ్రస్ :
- Principal, Zonal Staff Training College, Kakutur, Venkachalam Mandal SPSR Nellore District. PIN: 524320
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 17.09.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 04.10.2025
Notification | Click here |
NAPS Portal | Click here |
Official Website | Click here |
Also Read : TGSRTC Driver & Shramik Jobs 2025 | RTCలో 1,743 పోస్టులకు భారీ నోటిఫికేషన్