By Jahangir

Published On:

Follow Us
APSRTC Apprentice Notification 2025

APSRTC Apprentice Notification 2025 | ఆర్టీసీలో అప్రెంటీస్ పోస్టుల భర్తీ

APSRTC Apprentice Notification 2025 : ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.డిజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మిషనిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్ మెన్ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 277 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 25వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

ఖాళీల వివరాలు : 

కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 277 ఖాళీలు ఉన్నాయి. 

జిల్లా పేరుడీజిల్ మెకానిక్మోటార్ మెకానిక్ఎలక్ట్రీషియన్వెల్డర్పెయింటర్మెషనిస్ట్ఫిట్టర్డ్రాఫ్ట్ మేన్ (సివిల్)మొత్తం పోస్టులు
కర్నూల్33541111146
నంద్యాల32441110143
అనంతపురము37541111150
శ్రీ సత్య సాయి25331101034
కడప37751153160
అన్నమయ్య33441111144

Also Read : POWERGRID Officer Trainee Recruitment 2025 | విద్యుత్ సంస్థలో బంపర్ జాబ్స్

అర్హతలు మరియు వయోపరిమితి : 

APSRTC Apprentice Notification 2025 అభ్యర్థులు 10వ తరగతి మరియు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి గురించి నోటిఫికేషన్ లో ప్రస్తావించబడలేద. 

అప్లికేషన్ ఫీజు : 

APSRTC Apprentice Notification 2025 అభ్యర్థులు రూ.118/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు వెరిఫికేషన్ కు హాజరయ్యే సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ : 

APSRTC Apprentice Notification 2025 అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • మెరిట్ ఆధారంగా
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

దరఖాస్తు విధానం : 

APSRTC Apprentice Notification 2025 అభ్యర్థులు ముందుగా అప్రెంటిస్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 

  • ముందుగా www.apprenticeshipindia.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • తర్వాత అభ్యర్థులు తమ ఒరిజనల్ సర్టిఫికెట్లు మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కి హాజరుకావాల్సి ఉంటుంది. 
  • అడ్రస్ :  జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల, ఏ.పి.యస్. ఆర్. టీ. సి., బళ్లారి చౌరస్తా, కర్నూల్.

అవసరమైన సర్టిఫికెట్లు : 

  •  ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థి యొక్క ప్రొఫైల్
  •  www.apprenticeshipindia.gov.in పోర్టల్ నందు Apprenticeship Registration Number (ARN).
  •  SSC Marks list. 
  • ITI Marks (Consolldated Marks Memo
  •  NTC/NCVT Certificate (తప్పని సరి) 
  • కుల ధృవీకరణ పత్రము – SC/ST/BC (పర్మనెంట్ సర్టిఫికేట్ లేనియెడల ఆరు నెలల లోపు జారీ చేయబడిన తాత్కాలిక కుల ధృవీకరణ పత్రము 
  • వికలాంగులైనచో ధృవీకరణ పత్రము 
  • మాజీ సైనికోద్యోగుల పిల్లలైనచో ధృవీకరణ పత్రము 
  •  NCC మరియు Sports ఉన్నచో సంబందిత ధృవీకరణ పత్రములు 
  •  ఆధార్ కార్డు 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 25.10.2025
  • దరఖాస్తులకు చివరి తేదీ: 08.11.2025
NotificationClick here
Online PortalClick here

Also Read : DRDO LRDE Apprentice Recruitment 2025 | డీఆర్డీఓలో 105 ఖాళీలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment

Follow Google News
error: Content is protected !!