APPSC Technical Assistant(Geophysics) Recruitment 2025 | ఏపీ జలవనరుల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

APPSC Technical Assistant(Geophysics) Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ జలవనరుల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్(జియో ఫిజిక్స్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 02వ తేదీ వరకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

APPSC Technical Assistant(Geophysics) Recruitment 2025 Overview

నియామక సంస్థఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)
పోస్టు పేరుటెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్)
శాఖఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ
పోస్టుల సంఖ్య04
దరఖాస్తు ప్రక్రియ13 ఆగస్టు – 02 సెప్టెంబర్, 2025
అర్హతగుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జియోఫిజిక్స్ లో M.Sc / M.Sc(Tech) / M.Tech
వయస్సు18 – 42 సంవత్సరాలు

పోస్టుల వివరాలు : 

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్(జియోఫిజిక్స్) పోస్టుల భర్తీ కోసం ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుజోన్-4 ఖాళీల సంఖ్య
టెక్నికల్ అసిస్టెంట్(జియోఫిజిక్స్), ఏపీ భూగర్భజల సబ్ సర్వీస్04

అర్హతలు : 

APPSC Technical Assistant(Geophysics) Recruitment 2025 టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జియోఫిజిక్స్ లో M.Sc / M.Sc(Tech) / M.Tech ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి : 

APPSC Technical Assistant(Geophysics) Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు : 

APPSC Technical Assistant(Geophysics) Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.250/- మరియు ఎగ్జామినేషన్ ఫీజు రూ.80/- చెల్లించాలి. 
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు రేషన్ కార్డు కలిగిన అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు రూ.80/- మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: 

APPSC Technical Assistant(Geophysics) Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • రాత పరీక్ష
  • కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్

జీతం వివరాలు : 

APPSC Technical Assistant(Geophysics) Recruitment 2025 టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.54,060 నుంచి రూ.1,40,540/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

APPSC Technical Assistant(Geophysics) Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • OTPR రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 13 ఆగస్టు, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 02 సెప్టెంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!