APPSC Junior Lecturer Notification 2025: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లో జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు పెట్టుకోవచ్చు.

APPSC Junior Lecturer Notification 2025 Overview
నియామక సంస్థ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
పోస్టు పేరు | జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్స్ |
పోస్టుల సంఖ్య | 02 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తు ప్రక్రియ | 17 సెప్టెంబర్ – 07 అక్టోబర్, 2025 |
Also Read : APPSC AEE Recruitment 2025 | రూ.90 వేల జీతంతో గ్రామీణ నీటి సరఫరా శాఖలో AEE పోస్టులకు నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లో లైబ్రరీ సైన్స్ లో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
- పోస్టు పేరు : లైబ్రరీ సైన్స్ లో జూనియర్ లెక్చరర్
- పోస్టుల సంఖ్య : 02
అర్హతలు :
APPSC Junior Lecturer Notification 2025 జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో లైబ్రరీ సైన్స్ లో పీజీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి :
APPSC Junior Lecturer Notification 2025 అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
APPSC Junior Lecturer Notification 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ అభ్యర్థులు రూ.250/- అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు + రూ.120/- ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు రూ.370/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్, రేషన్ కార్డు ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250/- మాత్రమే చెల్లించాలి. ఎగ్జామినేషన్ ఫీజు రూ.120/- మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
APPSC Junior Lecturer Notification 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష
- కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్
- రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పరీక్షకు సంబంధించి పూర్తి సిలబస్ వివరాలు నోటిఫికేషన్ లో చూడవచ్చు.
జీతం వివరాలు :
APPSC Junior Lecturer Notification 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.57,100 – రూ.1,47,760/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
APPSC Junior Lecturer Notification 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు APPSC అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- OTPR (One Time Profile Registration) చేసుకోవాలి.
- OTPR ID, పాస్‌వర్డ్ తో psc.ap.gov.in లో లాగిన్ అవ్వాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన వివరాలు సరిచూసుకుని Save & Submit చేయాలి.
- ఫీజు చెల్లింపులు Net Banking / Debit / Credit Card ద్వారా మాత్రమే చేయాలి.
- ఫీజు చెల్లింపు తర్వాత Application Reference ID వస్తుంది.
- అభ్యర్థులు దరఖాస్తు కాపీని డౌన్‌లోడ్ చేసి భద్రపరచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 17 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 07 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : TGSRTC Driver & Shramik Jobs 2025 | RTCలో 1,743 పోస్టులకు భారీ నోటిఫికేషన్
2 thoughts on “APPSC Junior Lecturer Notification 2025 | ఏపీలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు”