APPSC FSO Notification 2025 ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో మరో బంపర్ నోటిఫికేషన్ ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అటవీ శాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్( FSO) పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 100 ఖాళీలు ఉన్నట్లు ఏపీపీఎస్సీ ప్రకనటలో తెలిపింది. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ జూలై 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఆగస్టు 17వ తేదీ వరకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
APPSC FSO Notification 2025 Overview:
- నియామక సంస్థ :ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
- పోస్టు పేరు : ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్
- పోస్టుల సంఖ్య :100
- దరఖాస్తు విధానం: ఆన్ లైన్
- వయోపరిమితి :18-30 సంవత్సరాలు
- జీతం :రూ.32,670 – రూ.1,01,970/-
పోస్టుల వివరాలు :
ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- Post : ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO)
- Fresh Posts : 70
- Carried Forward : 30
- Total : 100
అర్హతలు :
APPSC FSO Notification 2025 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
బాటనీ / ఫారెస్ట్రీ / హార్టికల్చర్ / జువాలజీ / ఫిజిక్స్ / కెమిస్ట్రీ / మ్యాథ్స్ / స్టాటిస్టిక్స్ / జియోలజీ / అగ్రిక్చర్ సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ (లేదా) కెమికల్ ఇంజనీరింగ్ / మెకానికల్ ఇంజనీరింగ్ / సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఫిజికల్ రిక్వైర్మెంట్ :
పురుషులు :
- ఎత్తు- 163 సెం.మీ
- ఛాతీ + విస్తరణ : 84 + 5 సెం.
మహిళలు :
- ఎత్తు :150 సెం.మీ
- ఛాతీ + విస్తరణ : 79 + 5 సెం.మీ
వయస్సు :
APPSC FSO Notification 2025 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- 18 – 30 సంవత్సరాలు
- ఎస్సీ/ఎస్టీ /బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోసడలింపు.
అప్లికేషన్ ఫీజు :
APPSC FSO Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250/- మరియు పరీక్ష ఫీజు రూ.80/- చెల్లించాలి.
- జనరల్ మరియు ఇతర రాష్ట్ర అభ్యర్థులకు ఫ రూ.330
- SC, ST, BC & మాజీ సైనికులు : రూ.250 (పరీక్ష ఫీజు రూ.80 మినహాయింపు)
ఎంపిక ప్రక్రియ:
APPSC FSO Notification 2025 పారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులక కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- ప్రిలిమినరీ పరీక్ష
- మెయిన్స్ పరీక్ష
- ఫిజికల్ టెస్ట్
- CPT
జీతం వివరాలు :
APPSC FSO Notification 2025 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.32,670 – రూ.1,01,970/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
APPSC FSO Notification 2025 అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు APPSC అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- హోమ్ పేజీలో ఆన్ లైన్ అప్లయ్ లింక్ పై క్లిక్ చేయాలి.
- OTPR రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- లాగిన్ అయ్యి ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 28 జూలై, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 17 ఆగస్టు, 2025
- ప్రిలిమినరీ పరీక్ష : 07 సెప్టెంబర్, 2025
Notification : CLICK HERE
Official Website : CLICK HERE