ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 2025 అక్టోబర్ 9న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టుల స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమినరీ ఎగ్జామ్) ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ www.psc.ap.gov.in లో అందుబాటులో ఉన్నాయి. మొత్తం 13,845 మంది అభ్యర్థులు మైన్ పరీక్షకు అర్హత సాధించారు.
APPSC FBO Results Overview
సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)
పోస్ట్ పేర్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO)
స్క్రీనింగ్ టెస్ట్ తేదీ 7 సెప్టెంబర్ 2025
ఫలితాల విడుదల తేదీ 9 అక్టోబర్ 2025
మైన్ ఎగ్జామ్ అర్హత పొందిన వారు 13,845 మంది
ఎంపిక దశలు స్క్రీనింగ్ టెస్ట్ → మైన్ ఎగ్జామ్ → వాకింగ్ టెస్ట్ → మెడికల్ టెస్ట్ → కంప్యూటర్ ప్రొఫిషెన్సీ టెస్ట్ (CPT)
Also Read : APPSC FSO Results 2025 Release | ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) ఫలితాలు 2025
APPSC FBO Results How to Check
అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in ఓపెన్ చేయండి.
హోమ్‌పేజ్‌లో “Results” సెక్షన్‌పై క్లిక్ చేయండి.
“Forest Beat Officer/Assistant Beat Officer Result 2025” లింక్‌పై క్లిక్ చేయండి.
PDF ఫైల్ ఓపెన్ అవుతుంది.
మీ రోల్ నంబర్ ఉంటే, మీరు మెయిన్ పరీక్షకు అర్హులు.
తర్వాతి దశ – మైన్ ఎగ్జామ్ మరియు ఇతర పరీక్షలు
స్క్రీనింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇప్పుడు మెయిన్ రాతపరీక్షకు హాజరు కావాలి.
మెయిన్ ఎగ్జామ్ తేదీ త్వరలో ప్రకటించబడుతుంది.
తరువాత వాకింగ్ టెస్ట్ ఉంటుంది – పురుషులు 25 కిమీ, మహిళలు 16 కిమీని 4 గంటల్లో నడవాలి.
మెడికల్ టెస్ట్ ద్వారా శారీరక ప్రమాణాలు పరిశీలిస్తారు.
చివరగా కంప్యూటర్ ప్రొఫిషెన్సీ టెస్ట్ (CPT) ఉంటుంది.
తుది ఎంపిక మైన్ ఎగ్జామ్ మార్కులు మరియు NCC బోనస్ మార్కుల ఆధారంగా ఉంటుంది.
అభ్యర్థులకు సూచనలు
ఫలితాలు చూసిన తర్వాత, అభ్యర్థులు మైన్ ఎగ్జామ్‌కు సిద్ధం కావాలి.
మైన్ ఎగ్జామ్ తేదీలు, హాల్ టిక్కెట్లు మరియు తదుపరి సూచనల కోసం APPSC వెబ్‌సైట్‌ను తరచూ చూడండి.
ఎంపిక కోసం అన్ని దశల్లో ఉత్తీర్ణత అవసరం.
APPSC Forest Beat Officer Result 2025 : Download