APPSC Executive Officer Grade-III Notification 2025 ఆలయాల్లో సేవ చేయాలనుకున్న వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 2025 ఆగస్టు 12న నోటిఫికేషన్ నం.10/2025 విడుదల చేసింది. ఇందులో ఏపీ ఎండోవ్మెంట్స్ సబ్ ఆర్డినేట్ సర్వీస్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. ఇది కేవలం ఉద్యోగావకాశమే కాకుండా, ఆలయ పరిపాలనలో ఒక గౌరవప్రదమైన సేవ చేయగల అవకాశాన్ని అందిస్తోంది.
APPSC Executive Officer Grade-III Notification 2025 Overview
నియామక సంస్థ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) |
పోస్టు పేరు | ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ |
పోస్టుల సంఖ్య | 07 |
దరఖాస్తు ప్రక్రియ | 13 ఆగస్టు – 02 సెప్టెంబర్, 2025 |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
అర్హతలు | ఏదైనా డిగ్రీ |
ఎంపిక ప్రక్రియ | రాత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ |
జాబ్ లొకేషన్ | ఆంధ్రప్రదేశ్ |
పోస్టుల వివరాలు
ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్ లో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 07 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- మొత్తం పోస్టుల సంఖ్య : 07
అర్హతలు :
APPSC Executive Officer Grade-III Notification 2025 అభ్యర్థి తప్పనిసరిగా హిందూ మతాన్ని ఆచరించే వ్యక్తి కావాలి. అదేవిధంగా, గుర్తింపు పొందిన భారత విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఇది ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ & ఎండోవ్మెంట్స్ యాక్ట్, 1987 సెక్షన్ 29(3) ప్రకారం తప్పనిసరి అర్హత.
- ఏదైన డిగ్రీ ఉత్తీర్ణత
వయోపరిమితి :
APPSC Executive Officer Grade-III Notification 2025 అభ్యర్థులకు 01.07.2025 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
APPSC Executive Officer Grade-III Notification 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.250/- మరియు ఎగ్జామినేషన్ ఫీజు రూ.80/- చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు రేషన్ కార్డు కలిగిన అభ్యర్థులకు రూ.80/- ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
APPSC Executive Officer Grade-III Notification 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష
- కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్
జీతం వివరాలు :
APPSC Executive Officer Grade-III Notification 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.25,220 నుంచి రూ.80,910/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. ప్రారంభంలో నెలకు రూ.40,000/- వరకు జీతం లభిస్తుంది.
దరఖాస్తు విధానం :
APPSC Executive Officer Grade-III Notification 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు ముందుగా APPSC అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- OTPR రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 13 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 02 సెప్టెంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |