APPSC Agriculture Officer Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. జోన్-1 మరియు జోన్-3లో మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 19వ తేదీ నుంచి సెప్టెంబర్ 08వ తేదీ వరకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
APPSC Agriculture Officer Recruitment 2025 Overview
| నియామక సంస్థ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) |
| పోస్టు పేరు | అగ్రికల్చర్ ఆఫీసర్ |
| శాఖ | ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ |
| పోస్టుల సంఖ్య | 10 |
| దరఖాస్తు ప్రక్రియ | 19 ఆగస్టు – 08 సెప్టెంబర్, 2025 |
| అర్హత | అగ్రికల్చర్ లో 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ |
| వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
పోస్టుల వివరాలు :
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జోన్-1 మరియు జోన్-3లో మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
| అగ్రికల్చర్ ఆఫీసర్ | ఖాళీల సంఖ్య |
| జోన్-1 | 08 |
| జోన్-3 | 02 |
| మొత్తం | 10 |
అర్హతలు :
APPSC Agriculture Officer Recruitment 2025 అగ్రిక్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లేదా ICAR ద్వారా గుర్తింపు పొందిన ఏదైనా అగ్రికల్చర్ యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి అగ్రికల్చర్ లో 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి :
APPSC Agriculture Officer Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
APPSC Agriculture Officer Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.250/- మరియు ఎగ్జామినేషన్ ఫీజు రూ120/- చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు రేషన్ కార్డు కలిగిన అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు రూ.120/- మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
APPSC Agriculture Officer Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష(పేపర్-1, పేపర్-2)
- కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్
జీతం వివరాలు :
APPSC Agriculture Officer Recruitment 2025 అగ్రిక్చర్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.54,060 నుంచి రూ.1,40,540/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
APPSC Agriculture Officer Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- OTPR రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 19 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 08 సెప్టెంబర్, 2025
| Notification | Click here |
| Apply Online | Click here |