APPSC AEE Recruitment 2025 | రూ.90 వేల జీతంతో గ్రామీణ నీటి సరఫరా శాఖలో AEE పోస్టులకు నోటిఫికేషన్

APPSC AEE Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) నుంచి మరో కొత్త నోటిఫికేషన్ విడులైంది. గ్రామీణ నీటి సరఫరా మరియు శానిటేషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 03 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 08వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు. 

APPSC AEE Recruitment 2025 Overview

నియామక సంస్థఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC)
శాఖ పేరుగ్రామీణ నీటి సరఫరా మరియు శాటేషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్
పోస్టు పేరుఅసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(సివిల్)
ఖాళీల సంఖ్య03
దరఖాస్తు ప్రక్రియ18 సెప్టెంబర్ – 08 అక్టోబర్, 2025

Also Read : APPSC Technical Assistant Recruitment 2025 | ఏపీ అటవీ శాఖలో కొత్త నోటిఫికేషన్.. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ

ఖాళీల వివరాలు : 

గ్రామీణ నీటి సరఫరా మరియు శానిటేషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల నియామకాల కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 03 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • పోస్టు పేరు : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
  • పోస్టుల సంఖ్య :: 03

అర్హతలు : 

APPSC AEE Recruitment 2025 అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ కలిగి ఉండాలి. సమానమైన అర్హతలు ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయోపరిమితి : 

APPSC AEE Recruitment 2025 అభ్యర్థులకు 18  నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. మాజీ సైనికులకు, NCC ఇన్‌స్ట్రక్టర్లకు సర్వీసు కాలానికి అనుగుణంగా రాయితీలు వర్తిస్తాయి. 

అప్లికేషన్ ఫీజు : 

APPSC AEE Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • జనరల్ అభ్యర్థులు : రూ.370/-
  • SC, ST, BC, PWBD, ఎక్స్-సర్వీస్‌మెన్, EWS : రూ.250/- (పరీక్ష ఫీజు రూ.120/- మినహాయింపు)

ఎంపిక ప్రక్రియ :: 

 APPSC AEE Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

  • రాత పరీక్ష : ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ -1లో సాధారణ అధ్యయనాలు మరియు మానసిక సామర్థ్యంపై ప్రశ్నలు ఉంటాయి. పేపర్-2లో సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టుపై ప్రశ్నలు అడుగుతారు. 
  • కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ తప్పనిసరి.
  • ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 

Also Read : NRF Sports Quota Recruitment 2025 | రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో బంపర్ నోటిఫికేషన్

జీతం వివరాలు : 

APPSC AEE Recruitment 2025 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన కమిషన్ (RPS 2022) ప్రకారం జీతం ఇవ్వబడుతుంది. ₹57,100 /- నుంచి ప్రారంభమై ₹1,47,760 /- వరకు ఉంటుంది. అన్ని అలవెన్సులు కలుపుకొని నెలకు సుమారుగా రూ.85,000/- నుంచి రూ.95,000/- వరకు జీతం ఉంటుంది. 

దరఖాస్తు విధానం : 

APPSC AEE Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు APPSC అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • OTPR (One Time Profile Registration) చేసుకోవాలి.
  • OTPR ID, పాస్‌వర్డ్ తో psc.ap.gov.in  లో లాగిన్ అవ్వాలి.
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన వివరాలు సరిచూసుకుని Save & Submit చేయాలి.
  • ఫీజు చెల్లింపులు Net Banking / Debit / Credit Card ద్వారా మాత్రమే చేయాలి.
  • ఫీజు చెల్లింపు తర్వాత Application Reference ID వస్తుంది.
  • అభ్యర్థులు దరఖాస్తు కాపీని డౌన్‌లోడ్ చేసి భద్రపరచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 18 సెప్టెంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 08 అక్టోబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : ECIL Technical Officer Recruitment 2025 | ఎలక్ట్రానిక్స్ సంస్థలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు.. ఇప్పుడే అప్లయ్ చేయండి..

1 thought on “APPSC AEE Recruitment 2025 | రూ.90 వేల జీతంతో గ్రామీణ నీటి సరఫరా శాఖలో AEE పోస్టులకు నోటిఫికేషన్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!