APMDC Notification 2025 | ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

APMDC Notification 2025 ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ బేసిక్ ప్రాతిపదికన వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 09 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వివిధ విభాగాల్లో మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా నియమిస్తున్నారు. అభ్యర్థులు మే 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్లు సమర్పించాలి.  

APMDC Notification 2025

పోస్టుల వివరాలు : 

ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వివిధ విభాగాల్లో మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ బేసిక్ ప్రాతిపదికన 3 సంవత్సరాల కాల పరిమితితో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అయితే కార్పొరేషన్ అవసరాల మేరకు కాలపరిమితిని పొడిగించవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 09 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

  • మొత్తం పోస్టుల సంఖ్య : 09
పోస్టు పేరుఖాళీల సంఖ్య పని ప్రదేశం
మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)01విజయవాడ
అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)01మధ్యప్రదేశ్
అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ)01విజయవాడ
అసిస్టెంట్ మేనేజర్ (మైనింగ్)03మంగమ్ పేట్
అసిస్టెంట్ మేనేజర్(జియోలజిస్ట్)01మంగమ్ పేట్
మేనేజర్ (ఎలక్ట్రికల్)01మధ్యప్రదేశ్
మేనేజర్ (సర్వేయర్ – కోల్ )01మధ్యప్రదేశ్

అర్హతలు : 

APMDC Notification 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతూ ఉంటాయి. విద్యార్హతలు మరియు అనుభవం వివరాలను కింద చూడవచ్చు.

పోస్టు పేరువిద్యార్హతలు మరియు అనుభవం
మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)PG (Finance) & CA ఉత్తీర్ణత + 10 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)PG (Finance) & CA ఉత్తీర్ణత + 5 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ)BE (IT/CSE) / B.Tech (IT / CSE) / MCA / MSC (Computers) + 7 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్ మేనేజర్ (మైనింగ్)మైనింగ్ ఇంజనీరింగ్ లో డిగ్రీ + సెకండ్ క్లాస్ మైన్ మేనేజర్ సర్టిఫికెట్
అసిస్టెంట్ మేనేజర్(జియోలజిస్ట్)జియోలజీలో MSc + 5 సంవత్సరాల అనుభవం
మేనేజర్ (ఎలక్ట్రికల్)ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ + 10 సంవత్సరాల అనుభవం
మేనేజర్ (సర్వేయర్ – కోల్)మైనింగ్ లేదా మైండ్ సర్వేలో డిప్లొమా లేదా సైన్స్ విభాగంలో డిగ్రీ + కూల్ మైనింగ్ సర్వే సర్టిఫికెట్ + 7 సంవత్సరాల అనుభవం

వయస్సు: 

APMDC Notification 2025 మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 45 సంవత్సరాల మధ్య వయస్సు మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

దరఖాస్తు ఫీజు : 

APMDC Notification 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంపిక ప్రక్రియ: 

APMDC Notification 2025 మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం విద్యార్హత మెరిట్ మార్కులు మరియు అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. 

జీతం : 

APMDC Notification 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి జీతం రావడం జరుగుతుంది. జీతం వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

  • మేనేజర్ పోస్టులకు : రూ.90,000/-
  • అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు : రూ.60,000/-

దరఖాస్తు విధానం: 

APMDC Notification 2025 పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. డౌన్ లోడ్ చేసుకున్న అప్లికేషన్ ని జాగ్రత్తగా నింపి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి. అప్లికేషన్ ఫారమ్ ని మే 15వ తేదీలోపు నోటిఫికేషన్ లో ఇచ్చిన చిరునామాకు సమర్పించాలి. 

  • దరఖాస్తులకు చివరి తేదీ : 15 – 05 – 2025 సాయంత్రం 5.00 గంటల లోపు
Notification & ApplicationCLICK HERE
Official WebsiteCLICK HERE

Leave a Comment

Follow Google News
error: Content is protected !!