By Jahangir

Published On:

Follow Us
APCOB Intern Recruitment 2025

APCOB Intern Recruitment 2025 | జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల్లో బంపర్ జాబ్స్

APCOB Intern Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్(APCOB) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. విజయవాడ మరియు రాష్ట్రంలోని 13 డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుల్లో కోఆపరేటివ్ ఇంటర్న్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీలోపు దరఖాస్తు ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

 

APCOB Intern Recruitment 2025 Overview

వివరాలుసమాచారం
సంస్థAndhra Pradesh State Cooperative Bank (APCOB) & 13 DCCBs
పోస్టు పేరుCooperative Interns
ఖాళీలు14 పోస్టులు
దరఖాస్తు చివరి తేదీ15 సెప్టెంబర్ 2025 (సాయంత్రం 5 గంటల వరకు)
ఉద్యోగ స్థలంAPCOB Vijayawada & జిల్లా DCCBs
ఇంటర్న్‌షిప్ వ్యవధి1 సంవత్సరం
నెలవారీ స్టైపెండ్₹25,000/-
అధికారిక వెబ్‌సైట్www.apcob.org

Also Read : AP Kaushalam Survey 2025 | ఏపీ కౌశలం సర్వే.. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం

ఖాళీల వివరాలు : 

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (APCOB), విజయవాడ మరియు రాష్ట్రంలోని 13 డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ (DCCBs) లో ఒక సంవత్సరం కాలానికి Cooperative Interns నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 14 ఖాళీలు ఉన్నాయి.

జిల్లా పేరుఖాళీలు
APCOB విజయవాడ01
శ్రీకాకుళం  DCCB01
విజయనగరం  DCCB01
విశాఖపట్నం DCCB01
కాకినాడ  DCCB01
ఏలూరు DCCB01
క్రిష్ణ DCCB01
గుంటూరు DCCB01
ప్రకాశం DCCB01
నెల్లూరు DCCB01
కర్నూలు DCCB01
చిత్తూరు DCCB01
కడప DCCB01
అనంతపురం DCCB01
మొత్తం14

అర్హతలు : 

APCOB Intern Recruitment 2025 కోఆపరేటివ్ ఇంటర్న్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు కంది అర్హతలు ఉండాలి. 

  • MBA లేదా సమానమైన కోర్సు (Marketing Management / Cooperative Management / Agri Business Management / Rural Development Management)
  • (లేదా) AICTE/UGC ఆమోదించిన 2 సంవత్సరాల PGDM కోర్సు
  • కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి

వయోపరిమితి : 

APCOB Intern Recruitment 2025 అభ్యర్థులకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు : 

APCOB Intern Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

APCOB Intern Recruitment 2025 అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • SSC, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్కుల ఆధారంగా Merit List తయారు చేస్తారు.
  • అదనపు అర్హతలకు కూడా మార్కులు కేటాయిస్తారు.
  • ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు.
  • మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు మాత్రమే ఫైనల్ సెలెక్షన్ జరుగుతుంది.

Also Read : NTPC Executive Trainee Recruitment 2025 | NTPCలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్

జీతం వివరాలు : 

APCOB Intern Recruitment 2025 పోస్టులకు ఎంపికైన ఇంటర్న్స్‌కు నెలకు ₹25,000/- స్టైపెండ్ ఇవ్వబడుతుంది.

దరఖాస్తు విధానం : 

APCOB Intern Recruitment 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్లు సమర్పించుకోవాలి.

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. 
  • అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అప్లికేషన్ ఫారమ్‌ను పూరించి, కవర్‌పై “APPLICATION FOR COOPERATIVE INTERNSHIP” అని రాయాలి.
  • కింది చిరునామాకు పంపాలి లేదా వ్యక్తిగతంగా సమర్పించాలి.

అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్:

  • The Deputy General Manager,
    HR Department,
    The Andhra Pradesh State Cooperative Bank Ltd.,
    NTR Sahakara Bhavan, Governorpet, Vijayawada – 520 002

దరఖాస్తులకు చివరి తేదీ : 15 సెప్టెంబర్, 2025 సాయంత్రం 5 గంటలలోపు

NotificationClick here
Application Click here
Official WebsiteClick here

Also Read : CBIC Sports Quota Recruitment 2025 | ట్యాక్స్ అసిస్టెంట్ & హవాల్దార్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

Follow Google News
error: Content is protected !!