AP Stree Nidhi Jobs 2025 ఆంధ్రప్రదేశ్ స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 170 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జులై 7వ తేదీ నుంచి జులై 18వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి.
AP Stree Nidhi Recruitment 2025 Overview:
నియామక సంస్థ | స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ |
పోస్టు పేరు | అసిస్టెంట్ మేనేజర్ |
పోస్టుల సంఖ్య | 170 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తు ప్రక్రియ | 07 జులై – 18 జులై, 2025 |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | రూ.25,520/- |
అర్హత | ఏదైనా డిగ్రీ |
పోస్టుల వివరాలు :
ఆంధ్రప్రదేశ్ స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 170 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ ఒక సంవత్సరం వరకు ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి పోస్టు వ్యవధిని పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ పోస్టుల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం, ఈడబ్ల్యూఎస్ లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు.
- పోస్టు పేరు : అసిస్టెంట్ మేనేజర్
- పోస్టుల సంఖ్య : 170
అర్హతలు :
AP Stree Nidhi Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ MS Office నాలెడ్జ్ ఉండాలి.
వయస్సు :
AP Stree Nidhi Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ / ఎస్టీ / బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
AP Stree Nidhi Recruitment 2025 అసిస్టెంట మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు రూ.1000/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం :
AP Stree Nidhi Recruitment 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- ధ్రువపత్రాల పరిశీలన
- షార్ట్ లిస్ట్ : ధ్రువపత్రాల పరిశీలన తర్వాత అభ్యర్థులను 1:4 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు.
- ఇంటర్వ్యూ
- మొత్తం 100 మార్కులకు మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. 10వ తరగతి మార్కుల నుంచి పనిచేసిన అనుభవం వరకు మార్కులను కేటాయిస్తారు. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడవచ్చు.
జీతం వివరాలు :
AP Stree Nidhi Recruitment 2025 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,520/- జీతం ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు కాబట్టి ఇతర అలవెన్సులు ఉండవు.
- నెలకు రూ.25,520/-
- ఎంపికైన వారు స్థానిక జిల్లాల్లో వారికి కేటాయించిన ఏదైనా మండలం లేదా పట్టణాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం :
AP Stree Nidhi Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 07.07.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 18.07.2025
Notification | Click here |
Official website | Click here |