AP Public Libraries Jobs 2025 | ఏపీ గ్రంథాలయాల్లో 976 ఖాళీలు

AP Public Libraries Jobs 2025 ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయాల్లో వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చసేందుకు రంగం సిద్ధమైంది. అయితే అధికారిక నోటఫికేషన్ అయితే రాలేదు. కానీ ఏపీ గ్రంథాలయ సంస్థలో ఖాళీల భర్తీకి సంబంధిత శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన అయితే పంపింది. దీంతో రాష్ట్రంలోని గ్రంథాలయాల్లో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే పూర్తి వివరాలు అయితే రావడం జరిగింది.  ఏపీలోని పబ్లిక్ లైబ్రరీల్లో లైబ్రేరియన్ గ్రేడ్-2, లైబ్రేరియన్ గ్రేడ్-3, రికార్డ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు, వాచ్ మెన్ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.  

 AP Public Libraries Jobs 2025

పోస్టుల వివరాలు : 

ఏపీలోని పబ్లిక్ లైబ్రరీల్లో లైబ్రేరియన్ గ్రేడ్-2, లైబ్రేరియన్ గ్రేడ్-3, రికార్డ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు, వాచ్ మెన్ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయాలని సంబంధిత శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మొత్తం 976 ఖాళీలు ఉన్నట్లు గ్రంథాలయ సంస్థ గుర్తించింది.  

మొత్తం ఖాళీల సంఖ్య : 976

పోస్టు పేరుఖాళీల సంఖ్య
లైబ్రేరియన్ గ్రేడ్-292
లైబ్రేరియన్ గ్రేడ్ – 3224
రికార్డ్ అసిస్టెంట్111
ఆఫీస్ సబార్డినేట్421
వాచ్ మెన్128

అర్హతలు : 

  • లైబ్రేరియన్ గ్రేడ్-2 మరియు లైబ్రేరియన్ గ్రేడ్-3 పోస్టులకు లైబ్రరీ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. 
  • రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హతలు ఉండాలి. 
  • ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 
  • అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాల గురించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్పష్టత వస్తుంది. 

వయస్సు : 

ఏపీ పబ్లిక్ లైబ్రరీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మద్య వయస్సు ఉండాలి. అయితే దీనిపై నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వివరాలపై స్పష్టత వస్తుంది.

ఎంపిక ప్రక్రియ: 

ఏపీ పబ్లిక్ లైబ్రరీలో ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ విధానంలో తాత్కాలికంగా భర్తీ చేయాలని సంస్థ ప్రతిపాదన పంపింది. తర్వాత డైరెక్ట్ రిక్కూట్మెంట్ ద్వారా పూర్తి స్థాయిలో నియామకాలు చేపడతారు. 

త్వరలోనే పూర్తి వివరాలు : 

ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలపై నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్పష్టత వస్తుంది. ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం లైబ్రరీల్లో సిబ్బంది కొరత ఉంది. సిబ్బంది లేకపోవడంతో కొన్ని లైబ్రరీలు మూతపడ్డాయి. దీంతో తాత్కాలికంగా ఉద్యోగులను నియమించుకోవాలని గ్రంథాలయ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి  గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 

2 thoughts on “AP Public Libraries Jobs 2025 | ఏపీ గ్రంథాలయాల్లో 976 ఖాళీలు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!