By Jahangir

Published On:

Follow Us
AP Prisons Department Jobs 2025

AP Prisons Department Jobs 2025 | ఏపీ జైళ్ల శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు

AP Prisons Department Jobs 2025 : ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఫార్మసిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మన్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీలోపు పోస్టు ద్వారా లేదా కొరియర్ ద్వారా అప్లికేషన్లు సమర్పించాలి. 

ఖాళీల వివరాలు : 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా జైల్ లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పార్మాసిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మన్, డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం ఏపీ జైళ్ల శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • ఫార్మసిస్ట్ (గ్రేడ్-2) : 01
  • ఆఫీస్ సబార్డినేట్ : 01
  • వాచ్ మన్ : 01
  • డ్రైవర్(LMV) : 01

Also Read : APCRDA Latest Jobs 2025 | ఏపీ రాజధాని ప్రాంతంలో భారీగా ఉద్యోగాలు

అర్హతలు : 

AP Prisons Department Jobs 2025 పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. 

  • ఫార్మసిస్ట్ : B.Pharma / M.Pharma / D.Pharma ఉత్తీర్ణులై ఉండాలి. 
  • ఆఫీస్ సబార్డినేట్ : 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 
  • వాచ్ మన్ : 5వ లేదా 7వ తరగతి చదివి ఉండాలి.
  • డ్రైవర్ : 10వ తరగతి ఉత్తీర్ణత + లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.  

వయోపరిమితి : 

AP Prisons Department Jobs 2025 అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

AP Prisons Department Jobs 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

AP Prisons Department Jobs 2025 పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల విద్యార్హతల్లో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫార్మసిస్ట్ పోస్టుకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది.

Also Read : APDC Recruitment 2025 | ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో జాబ్ నోటిఫికేషన్

జీతం వివరాలు : 

AP Prisons Department Jobs 2025 ఎంపికైన అభ్యర్థులకు మంచి జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • ఫార్మసిస్ట్ గ్రేడ్-2 : రూ.17,500/-
  • ఆఫీస్ సబార్డినేట్ : రూ.15,000/-
  • వాచ్ మన్ : రూ.15,000/-
  • డ్రైవర్ : రూ.18,500/-

దరఖాస్తు విధానం : 

AP Prisons Department Jobs 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్లు సమర్పించాలి. 

  • అభ్యర్థులు ముందుగా https://guntur.ap.gov.in వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • రిక్రూట్మెంట్ విభాగంలో ఉన్న అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోండి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు జత చేయాలి. 
  • పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్ ని కింది అడ్రస్ కి పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపాలి. 
  • అడ్రస్ : The Superintendent, District Jail, Taluka compound, Brodipet, Guntur 522002, Guntur District.

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 15.09.2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 29.09.2025
NotificationClick here
ApplicationClick here
Official websiteClick here

Also Read : IOCL Junior Engineer Recruitment 2025 | రూ.10 లక్షల ప్యాకేజీతో IOCL కొత్త నోటిఫికేషన్

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Follow Google News
error: Content is protected !!