AP Mega DSC Notification 2025 | ఏప్రిల్ మొదటి వారంలో DSC, జూన్ లో పోస్టింగ్

AP Mega DSC Notification 2025 ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ పోస్టుల విషయంలో తాజా అప్ డేట్ వచ్చింది. ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న AP DSC Notification పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేేశారు. ఏప్రిల్ మొదటి వారంలో AP DSC Notification విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జూన్ లో స్కూళ్లు ప్రారంభం అయ్యే నాటికి పోస్టింగులు ఇస్తామని చెప్పారు. 

AP Mega DSC Notification 2025

పోస్టుల వివరాలు :

ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 టీచర్ల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ పోస్టులలో జిల్లా పరిషత్, మండల పరిషత్ మరియు మున్సిపల్ స్కూల్స్ లో 14,066 పోస్టులు, రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, బీసీ, గిరిజిన స్కూళ్లలో 2,281 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మార్చిలో AP DSC Notification ను ఎలాంటి అడ్డంకులు లేకుండా విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. పోస్టుల కేటాయింపులు చూస్తే..

మొత్తం పోస్టుల సంఖ్య : 16,347

  • సెకండరీ గ్రేడ్ టీచర్లు – 6,371
  • స్కూల్ అసిస్టెంట్లు – 7,725
  • ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు – 1,781
  • పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు – 286
  • ప్రిన్సిపల్ పోస్టులు – 52
  •  పీఈటీ టీచర్లు – 132

జిల్లాల వారీగా పోస్టులు :

  • శ్రీకాకుశం – 543
  • విజయనగరం – 583
  • విశాఖపట్నం -1,134
  • తూర్పుగోదావరి – 1,346
  • పశ్చిమ గోదావరి – 1,067
  • క్రిష్ణ జిల్లా – 1,213
  • గుంటూరు – 1,159
  • ప్రకాశం – 672
  • నెల్లూరు – 673
  • చిత్తూరు – 1,478
  • కడప – 709
  • అనంతపురం – 811
  • కర్నూలు – 2,678

డీఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే చేశారు. కానీ పలు కారణాలతో ఈ నోటిఫికేషన్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు మెగా డీఎస్సీపై ప్రకటన వచ్చింది.

Leave a Comment

Follow Google News
error: Content is protected !!