AP HM&FW Recruitment 2025 | ఏపీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో 3,920 ఉద్యోగాలు

AP HM&FW Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు సమర్థవంతంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆరోగ్య శాఖ కమిషనర్ మరియు నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

AP HM&FW Recruitment 2025

పోస్టుల వివరాలు: 

అర్బన్ క్లినిక్స్ లోని మానవ వనరుల నియామకానికి సంబంధించి వివిధ పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,920 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో కొన్ని పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో, మరికొన్ని పోస్టులు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 

  • మొత్తం పోస్టుల సంఖ్య : 3,920
పోస్టు పేరుఖాళీల సంఖ్య
మెడికల్ ఆఫీసర్ (కాంట్రాక్ట్)560
స్టాఫ్ నర్స్ (కాంట్రాక్ట్)1,120
ల్యాబ్ టెక్నీషియన్ (కాంట్రాక్ట్)560
ఫార్మాసిస్ట్ (కాంట్రాక్ట్)560
డేటా ఎంట్రీ ఆపరేటర్ (అవుట్ సోర్సింగ్)560
శానిటరీ అటెండెంట్ / ఎల్ఎస్జీ (అవుట్ సోర్సింగ్)560

అర్హతలు, ఎంపిక ప్రక్రియ మరియు వయోపరిమితి : 

AP HM&FW Recruitment 2025 పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపిక ప్రక్రియ మరియు వయోపరిమితి వివరాలు పూర్తి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తెలుస్తాయి. 

జీతం వివరాలు : 

  • మెడికల్ ఆఫీసర్ : రూ.61,960/-
  • స్టాఫ్ నర్స్ : రూ.27,675/-
  • ల్యాట్ టెక్నీషియన్ : 23,393/-
  • ఫార్మాసిస్ట్ : రూ.23,393/-
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ : రూ.18,450/-
  • శానిటరీ అటెండెంట్ : రూ.15,000/-

త్వరలోనే ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. 

Notification : Click here

4 thoughts on “AP HM&FW Recruitment 2025 | ఏపీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో 3,920 ఉద్యోగాలు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!