AP Forest Jobs Update | ఏపీ అటవీ శాఖ ఉద్యోగాలపై తాజా అప్ డేట్ | 689 పోస్టుల భర్తీ

ఏపీలో అటవీ శాఖ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. తాాజాగా అటవీ శాఖ ఉద్యోగాలపై కొత్త అప్ డేట్ అయితే రావడం జరిగింది. అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 689 పోస్టులను రానున్న ఆరు నెలల్లో భర్తీ చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి వెల్లడించారు. రేంజ్, సెక్షన్, బీట్ ఆఫీసర్ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.

AP Forest Jobs Update – ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు:

ఏపీ అటవీ శాఖలో మొత్తం 689 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో

  • ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ – 175

-ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ – 37

-ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ – 70

-అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ – 375

Agniveer Vayu Non Combatant Recruitment 2025 | ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు | నెలకు రూ.30,000/- జీతం

-జూనియర్ అసిస్టెంట్ – 10

-థానేదార్ – 10

-టెక్నికల్ అసిస్టెంట్ – 12

ఏపీలోని అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 689 పోస్టులకు ఇప్పుటికే ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించింది. ఈ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అటవీ శాఖ ఉద్యోగాలపై కొత్త అప్ డేట్ రావడంతో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా కాలంగా రాష్ట్రంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడలేదు. దీంతో నిరుద్యోగులు ఎంతో నిరుత్సాహాంతో ఉన్నారు. ఇప్పుడు ఈ ఉద్యోగాలపై అప్ డేట్ రావడంతో ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేందుకు వారికి సమయం ఉంటుంది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఇప్పటి నుంచే అటవీ శాఖలో ఉద్యోగాల కోసం సన్నద్ధం అవ్వండి..

2 thoughts on “AP Forest Jobs Update | ఏపీ అటవీ శాఖ ఉద్యోగాలపై తాజా అప్ డేట్ | 689 పోస్టుల భర్తీ”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!