By Jahangir

Published On:

Follow Us
AP DWCWEO Notification 2025

AP DWCWEO Notification 2025 | ఆయా, మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్

AP DWCWEO Notification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న మహిళలకు గుడ్ న్యూస్. ఆలూరు సీతారామ రాజు జిల్లా మహిళా & శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం (DWCWEO) మిషన్ వత్సల్య పథకం కింద స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA) లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మేనేజర్, డాక్టర్, ఆయా పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించుకోవాలి. ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.  

Also Read : AP One Stop Centre Jobs 2025 | 10th అర్హతతో వన్ స్టాప్ సెంటర్ లో జాబ్స్

ఖాళీల వివరాలు : 

 ఆలూరు సీతారామ రాజు జిల్లా మహిళా & శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం (DWCWEO) మిషన్ వత్సల్య పథకం కింద స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA) లో మేనేజర్, డాక్టర్, ఆయా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • మేనేజర్ / కోఆర్డినేటర్ : 01 
  • డాక్టర్ (పార్ట్ టైమ్) : 01
  • ఆయాలు : 03

అర్హతలు : 

AP DWCWEO Notification 2025 పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి.

మేనేజర్ / కోఆర్డినేటర్:

  • MSW (Social Work) / మాస్టర్స్ ఇన్ సైకాలజీ / M.Sc. హోమ్ సైన్స్ (చైల్డ్ డెవలప్మెంట్)
  • కనీసం 3 ఏళ్ల అనుభవం మహిళా / శిశు సంక్షేమ రంగంలో ఉండాలి.
  • దత్తత (Adoption) సంబంధిత పనిలో అనుభవం ఉంటే ప్రాధాన్యం.
  • కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు NGOs/ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసే నైపుణ్యం ఉండాలి.

డాక్టర్ (పార్ట్‌టైమ్):

  • MBBS పూర్తిచేసి ప్రాక్టీస్ చేస్తుండాలి.
  • పిల్లల వైద్యంలో (Pediatrics) స్పెషలైజేషన్ ఉండాలి.
  • రెగ్యులర్ & ఎమర్జెన్సీ సమయంలో సేవలు అందించగలగాలి.

అయాలు (Ayahs):

  • శిశువులను, చిన్నపిల్లలను చూసుకునే అనుభవం ఉండాలి.

వయోపరిమితి : 

AP DWCWEO Notification 2025 అన్ని పోస్టులకు 01.07.2025 నాటికి 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు : 

AP DWCWEO Notification 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

AP DWCWEO Notification 2025 అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. తుది ఎంపిక పూర్తిగా ఇంటర్వ్యూలో పనితీరుపై ఆధారపడి ఉంటుంది.

జీతం వివరాలు : 

AP DWCWEO Notification 2025 పోస్టును బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది.

  • మ్యానేజర్ / కోఆర్డినేటర్ – ₹23,170/-
  • డాక్టర్ (Part-time) – ₹9,930/-
  • అయ్యాలు – ₹7,944/-

దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్‌ను అధికారిక వెబ్‌సైట్ నుండి http://allurisitharamaraju.ap.gov.in డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • దరఖాస్తుతో పాటు అర్హత సర్టిఫికెట్లు, మార్క్‌లిస్ట్‌లు, అనుభవ సర్టిఫికెట్లు (అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు) జత చేయాలి.
  • పూర్తి చేసిన దరఖాస్తును 08.10.2025 సాయంత్రం 5 గంటలలోపు కింది చిరునామాకు నేరుగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపాలి:

అడ్రస్

  • జిల్లా మహిళా & శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి, తలసింగి సమీపంలో, బాలసదన్ పక్కన, పాడేరు, ASR జిల్లా – 531024.

దరఖాస్తులకు చివరి తేదీ : 08 అక్టోబర్, 2025

Notification & ApplicationClick here
Official WebsiteClick here

Also Read : VITM Trainee Craft Recruitment 2025 | మ్యూజియంలో ట్రైనీ క్రాఫ్ట్ జాబ్స్

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment

Follow Google News
error: Content is protected !!