AP DSC 2026 | ఫిబ్రవరిలో మరో డీఎస్సీ – 2,500 పోస్టులు – ఈసారి కీలక మార్పులు

AP DSC 2026 : ఏపీలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖాధికారులు సన్నద్ధమవుతున్నారు. 2025 సంవత్సరంలో 16 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం 2026 సంవత్సరాలనికి మళ్లీ డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ఫిబ్రవరి నెలలోనే డీఎస్సీ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ డీఎస్సీ ద్వారా 2,500 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

గతేడాది మెగా డీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే.. 16వేలకు పైగా పోస్టులను భర్తీ చేసింది. అయినప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. ఇదే కాకుండా ఏడాది టీచర్స్ రిటైర్మెంట్స్ కూడా భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఉపాధ్యాయుల కొరత ఉండకూడదనే భావనతో మరో డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం ముందుకొచ్చినట్ల తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,500 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. 

ఈ సారి కీలక మార్పులు

AP DSC 2026 ఈ సారి డీఎస్సీలో కీలక మార్పులు చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విద్యార్థులకు టెక్నికల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అందించడమే లక్ష్యంగా కొత్త నిబంధనలను అయితే తీసుకురానుంది. ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రావీణ్యం, కంప్యూటర్ అవగాహనపై ఒక ప్రత్యేక పేపర్ ను ప్రవేశ పెట్టాలని ప్రతిపాదన పెట్టినట్లు తెలిసింది. ఇప్పటి వరకు కేవలం సబ్జెక్ట్ స్కిల్స్ కే డీఎస్సీ పరిమితమైంది. ఇక నుంచి అభ్యర్థుల మల్టీపుల్ స్కిల్స్ ని పరీక్షించనున్నారు.  

అందుకోసమే డీఎస్సీలో కొత్త పేపర్ ప్రవేశపెట్టాలని విద్యాశాఖ ప్రతిపాదనను రూపొందిస్తోంది. ఇకపై డీఎస్సీలో ప్రస్తతం ఉన్న సిలబస్ తో పాటు ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్, డిజిటల్ లెర్నింగ్ అంశాలపై పరీక్ష నిర్వహించలన భావిస్తోంది. ఇంకా ఈ మార్పులపై ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. అన్ని అనుమతులు వస్తే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి, కొత్త విద్యాసంవత్సరం నాటికి ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. 

Leave a Comment

Follow Google News
error: Content is protected !!