AP Contract / Outsourcing Jobs 2025 | మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

AP Contract / Outsourcing Jobs 2025 ఏపీ ఆరోగ్య విద్యాశాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 122 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 16వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 

పోస్టుల వివరాలు : 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలోని డాక్టర్ యల్ల ప్రగడ సుబ్బారావు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మరియు జనరల్ హాస్పిటల్ లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడదల చేయడం జరిగింది. మొత్తం 122 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కాంట్రాక్ట్ పద్ధతిలో 46, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 76 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

ప్రభుత్వ మెడికల్ కాలేజీ35 పోస్టులు
జనరల్ హాస్పిటల్87 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య122

డాక్టర్ యల్లప్రగడ సుబ్బారావు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఖాళీలు:

పోస్టు పేరుఖాళీల  సంఖ్యభర్తీ చేసే విధానంజీతం
స్టోర్ కీపర్03అవుట్ సోర్సింగ్రూ.18,500/-
కంప్యూటర్ ప్రోగ్రామర్01కాంట్రాక్ట్రూ.34,580/-
ఎలక్ట్రికల్ హెల్పర్01అవుట్ సోర్సింగ్రూ.15,000/-
ఆఫీస్ సబార్డినేట్09అవుట్ సోర్సింగ్రూ.15,000/-
మార్చురీ అటెండెంట్04అవుట్ సోర్సింగ్రూ.15,000/-
జనరల్ డ్యూటీ అటెండెంట్15అవుట్ సోర్సింగ్రూ.15,000/-
ల్యాబ్ అటెండెంట్02అవుట్ సోర్సింగ్రూ.15,000/-

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ఖాళీలు :

పోస్టు పేరుఖాళీల సంఖ్యభర్తీ చేసే విధానంజీతం
రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్ 01కాంట్రాక్ట్రూ.35,570/-
కార్డియాలజీ టెక్నీషియన్03కాంట్రాక్ట్రూ.37,640/-
చైల్డ్ సైకాలజిస్ట్01కాంట్రాక్ట్రూ.54,060/-
క్లినికల్ సైకాలజిస్ట్ 01కాంట్రాక్ట్రూ.54,060/-
కంప్యూటర్ ప్రోగ్రామర్01కాంట్రాక్ట్రూ.34,580/-
ఎలక్ట్రికల్ హెల్పర్02అవుట్ సోర్సింగ్రూ.15,000/-
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్28కాంట్రాక్ట్రూ.32,670/-
జనరల్ డ్యూటీ అటెండెంట్22అవుట్ సోర్సింగ్రూ.15,000/-
ల్యాబ్ అటెండెంట్ 03అవుట్ సోర్సింగ్రూ.15,000/-
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-204కాంట్రాక్ట్రూ.32,670/-
నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్01కాంట్రాక్ట్రూ.34,580/-
ఆఫీస్ సబార్డినేట్14అవుట్ సోర్సింగ్రూ.15,000/-
ఓటీ టెక్నీషియన్01కాంట్రక్ట్రూ.23,120/-
సైకియాట్రిక్ సోషల్ వర్కర్02కాంట్రాక్ట్రూ.38,720/-
స్పీచ్ థెరపిస్ట్01కాంట్రాక్ట్రూ.40,970/-
స్టోర్ అటెండెంట్01అవుట్ సోర్సింగ్రూ.15,000/-
సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్01కాంట్రాక్ట్రూ.34,580/-

అర్హతలు : 

ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మరియు జనరల్ హాస్పిటల్ లో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు పోస్టును బట్టి 10వ తరగతి/ ఇంటర్మీడియట్ / డిగ్రీ/ బీఈ/ బీటెక్ / ఎంసీఏ / ఎంఏ / బీఎస్సీ / పీజీ అర్హతలు ఉండాలి. విద్యార్హతల పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి. 

వయస్సు : 

కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు  చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ.250/- అప్లికేషన్ ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. డిమాండ్ డ్రాఫ్ట్ ‘ది ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, ఏలూరు’ పేరుపై తీయాలి. 

 ఎంపిక ప్రక్రియ: 

AP Contract / Outsourcing Jobs 2025 పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

జీతం వివరాలు : 

AP Contract / Outsourcing Jobs 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి రూ.15,000/- నుంచి రూ.54,060/- వరకు జీతాలు ఉంటాయి. 

దరఖాస్తు విధానం : 

AP Contract / Outsourcing Jobs 2025 ఉద్యోగాలకు అభ్యర్థులు ఆఫ్ లైన్ లో అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుంది. జూన్ 2వ తేదీ నుంచి జూన్ 16వ తేదీ వరకు అప్లికేషన్లు సమర్పించాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. 
  • అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలను మరియు ఫీజు చెల్లించిన డిమాండ్ డ్రాఫ్ట్ అప్లికేషన్ కి జత చేయాలి. 
  • అప్లికేషన్ ని ఏలూరులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ కార్యాలయలో సమర్పించాలి. 

ముఖ్యమైన తేదీలు: 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 02 జూన్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 16 జూన్, 2025
NotificationClick here
Application FormClick here
Official websiteClick here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!