AP Commercial Tax Department Jobs 2025 ఆంధ్రప్రదేశ్ లో వాణిజ్య పన్నుల శాఖ నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను మే 3వ తేదీలోపు సమర్పించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను స్వయంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాలి.
AP Commercial Tax Department Jobs 2025
పోస్టుల వివరాలు :
విశాఖపట్నం జిల్లా వాణిజ్య పన్నుల శాఖలో ప్రాంతీయ జీఎస్టీ, ఆడిట్ మరియు ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయంలో ఓట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య : 12
పోస్టు పేరు | ఖాళీలు |
డేటా ఎంట్రీ ఆపరేటర్ | 07 |
ఆఫీస్ సబార్డినేట్ | 05 |
అర్హతలు :
Vizag Commercial Tax Department Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
పోస్టు పేరు | అర్హతలు |
డేటా ఎంట్రీ ఆపరేటర్ | ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ MS Office లో డిప్లొమా లేదా పీజీ డిప్లొమా ఉండాలి. సంబంధిత రంగంలో పనిఅనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. |
ఆఫీస్ సబార్డినేట్ | 7వ తరగతి ఉత్తీర్ణత |
వయస్సు:
Vizag Commercial Tax Department Jobs 2025 డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
Vizag Commercial Tax Department Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
జీతం :
Vizag Commercial Tax Department Jobs 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును అనుసరించి జీతాలు ఉంటాయి.
- డేటా ఎంట్రీ ఆపరేటర్ : రూ.18,500/-
- ఆఫీస్ సబార్డినేట్ : రూ.15,000/-
దరఖాస్తు విధానం:
Vizag Commercial Tax Department Jobs 2025 డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి దరఖాస్తులను కింది అడ్రస్ కి పంపాలి. అప్లికేషన్ ని కింద ఇచ్చిన కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్స్ లో మే 3వ తేదీలోపు వేయవలసి ఉంటుంది. లేదా రిజిస్ట్రర్ పోస్టు ద్వారా కింది అడ్రస్ కి గడువు తేదీ లోపు చేరేలా పంపించాలి.
అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్:
అదనపు కమిషనర్, ప్రాంతీయ జి.యస్.టి. ఆడిట్ మరియు ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయం, మొదటి అంతస్తు, వి.ఎం.ఆర్.డి.ఎ. భవనం, సిరిపురం, విశాఖపట్నం.
జత పరచాల్సిన డాక్యుమెంట్స్:
- అర్హతల ధ్రువపత్రాలు
- కుల ధ్రువీకరణ పత్రం
- రేషన్ కార్డు
- ఆధార్ కార్డు
- పని అనుభవం సర్టిఫికెట్ (ఉంటే)
- ఇతర ధ్రువ పత్రాలు
ఈ భర్తీ ప్రక్రియ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గత APCOS ఔట్ సోర్సింగ్ కమిటీ, విశాఖపట్నం జిల్లా వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎంపిక పూర్తిగా పారదర్శంగా , పని అనుభవం మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికగా జరుపుతారు.
- దరఖాస్తులకు చివరి తేదీ : 03 -05 – 2025
Notification & Application | CLICK HERE |
Official Website | CLICK HERE |