AP Career & Mental Health Counsellors Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల కెరీర్ గైడెన్స్, మానసిక ఆరోగ్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ EdCIL (India) Limited ద్వారా భారీ నియామకాలు జరుగుతున్నాయి. District Career and Mental Health Counsellors పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి. అర్హత ఉన్న అభ్యర్థులకు నెలవారీ జీతంతో పాటు అదనపు అలవెన్స్ కూడా లభిస్తుంది.
ఖాళీల వివరాలు (Vacancy Details)
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 424 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- District Career and Mental Health Counsellors – 424 పోస్టులు
- పోస్టింగ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాలు & మండలాలు
Also Read : Indian Navy B.Tech Cadet Entry 2026 | నేవీలో ఇంజినీరింగ్‌తో పాటు ఆఫీసర్ జాబ్
అర్హతలు (Educational Qualification)
AP Career & Mental Health Counsellors Recruitment 2026 ఈ పోస్టులకు అప్లై చేయాలంటే అభ్యర్థులకు కింది అర్హతలలో ఏదైనా ఉండాలి.
- M.Sc / M.A in Psychology (Applied / Counselling / Clinical / Child / Adolescent Psychology)
- M.Sc / M.Phil in Psychiatric Social Work
- M.Sc in Psychiatric Nursing
- MSW (Medical & Psychiatric Social Work లేదా Counselling స్పెషలైజేషన్‌తో)
- B.A / B.Sc (Honours) in Psychology
- English లో మాట్లాడే, రాసే సామర్థ్యం తప్పనిసరి
- Telugu భాషపై అవగాహన ఉంటే అదనపు ప్రాధాన్యం
- PG అభ్యర్థులకు అనుభవం అవసరం లేదు
- B.A / B.Sc Psychology అభ్యర్థులకు కనీసం 2 సంవత్సరాల కౌన్సెలింగ్ అనుభవం అవసరం
వయోపరిమితి (Age Limit)
AP Career & Mental Health Counsellors Recruitment 2026 అభ్యర్థులకు 31 డిసెంబర్ 2025 నాటికి గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు (Application Fee)
AP Career & Mental Health Counsellors Recruitment 2026 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ (Selection Process)
AP Career & Mental Health Counsellors Recruitment 2026 అభ్యర్థుల ఎంపిక కింది విధంగా జరుగుతుంది.
- విద్యార్హతలు & అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్
- షార్ట్‌లిస్టు అయిన వారికి ఇంటర్వ్యూ
- అవసరమైతే వెయిటింగ్ లిస్ట్ కూడా తయారు చేస్తారు.
జీతం వివరాలు (Salary Details)
AP Career & Mental Health Counsellors Recruitment 2026 ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹30,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. అదనంగా ప్రయాణ భత్యం ₹4,000 వరకు (రీఇంబర్స్‌మెంట్ ఆధారంగా) ఉంటుంది.
ఉద్యోగ కాలవ్యవధి (Contract Period)
- ప్రారంభంగా: 31 మార్చి 2026 వరకు
- పనితీరు & అవసరాన్ని బట్టి జూన్ 2026 నుంచి మార్చి 2027 వరకు పొడిగించే అవకాశం
దరఖాస్తు విధానం (How to Apply)
AP Career & Mental Health Counsellors Recruitment 2026 అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.
- అప్లై లింక్: EdCIL అధికారిక ఆన్‌లైన్ ఫారం (Google Form)
- అన్ని సర్టిఫికేట్లు PDF ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి
- సందేహాలకు మెయిల్: tsgrecruitment9@gmail.com
ముఖ్యమైన తేదీలు
- అప్లికేషన్ ప్రారంభం: 06 జనవరి 2026
- చివరి తేదీ: 18 జనవరి 2026
Notification : Click here
Apply Online : Click here
Also Read : NALCO GET Recruitment 2026 | NALCOలో భారీ ప్యాకేజ్ తో జాబ్స్ – 110 పోస్టులు